ఆంక్షలు మరింత సడలింపు

ABN , First Publish Date - 2021-06-19T05:32:03+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆంక్షలను ప్రభుత్వం మరింతగా సడలించింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నిరకాల కార్యకలాపాలు కొనసాగుతాయి. తర్వాత ఒక గంట సమయాన్ని రాకపోకల కోసం అనుమతిస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

ఆంక్షలు మరింత సడలింపు
వాహనాల తాకిడితో రద్దీగా ఉన్న ఒంగోలులోని ట్రంకురోడ్డు

సాయంత్రం 5 వరకు అన్నిరకాల కార్యకలాపాలు, 

రాకపోకలకు మరో గంట

ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ పనివేళలు

సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్య్పూ

ఈనెల 21 నుంచి అమలుకు ప్రభుత్వం నిర్ణయం

ఒంగోలు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆంక్షలను ప్రభుత్వం మరింతగా సడలించింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నిరకాల కార్యకలాపాలు కొనసాగుతాయి. తర్వాత ఒక గంట సమయాన్ని రాకపోకల కోసం అనుమతిస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అలా ఈనెల 21 నుంచి 30 వరకు అమలుకు ప్రభుత్వం నిర్ణయించి అధికారులను అమలుచేయాలని శుక్రవారం ఆదేశించింది. కాగా ఇప్పటివరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తుండగా ఈనెల 21 నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేయనున్నాయి. తాజా ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇతరత్రా అన్నిరకాల సంస్థలకు మరికొంత వెసులుబాటు కలగనుంది. అయితే ప్రస్తుతం కర్ఫ్యూ సడలింపు సమయంలో యంత్రాంగం పర్యవేక్షణ ఏ మాత్రం ఉండటం లేదు. అలాగే తదనంతర ఆంక్షల సడలింపు సమయంలో కూడా వ్యవహరిస్తే కరోనా తీవ్రత జిల్లాలో మళ్లీ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. 


Updated Date - 2021-06-19T05:32:03+05:30 IST