రికార్డు స్థాయిలో వరి సాగు

ABN , First Publish Date - 2020-08-14T11:14:09+05:30 IST

ప్రభుత్వ నియంత్రిత సాగు పిలుపు జిల్లాలోని రైతులు వరి సాగుకు మళ్లారు. ప్రభుత్వ ఆదేశాలతో మొక్కజొన్న, ఇతర

రికార్డు స్థాయిలో వరి సాగు

నిజామాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ నియంత్రిత సాగు పిలుపు జిల్లాలోని రైతులు వరి సాగుకు మళ్లారు.  ప్రభుత్వ ఆదేశాలతో మొక్కజొన్న, ఇతర పంటలను తగ్గించిన రైతులు రికార్డు స్థాయిలో వరిసాగుచేశారు. నిర్ణయించిన ల క్ష్యాని కన్నా ఎక్కువ మొత్తంలో సాగవుతుండడంతో అధికారులు గ్రామా ల వారీగా పంటను అంచనా వేస్తున్నారు. ఎరువులకు ఇబ్బందులు కలు గకుండా ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో పంటల విస్తీర్ణంపై ప్రభుత్వా నికి నివేదిక పంపించేందుకు సిద్ధ్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ని యంత్రిత వ్యవసాయంతో లాభసాటి పంటలను సాగుచేయాలని ఆదే శాలు ఇచ్చింది. మొక్కజొన్నకు ధర రావడం లేనందున ఈ వానాకాలం లో తగ్గించి ఇతర పంటలను సాగుచేయాలని కోరింది. వానాకాలం ప్రా రంభంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందుగానే ప్రకటించింది.


ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ అదికారులు గ్రామాల వారీగా అవగాహన కల్పించారు. లాభదాయక పం టలను పండించాలని కోరారు. ఇతర పంటలకు సంబంధించిన విత్త నాలు, ఎరువులు అందుబాటులో ఉంచారు. రైతులు కావాల్సిన వివ రాలను అందించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఈ దఫా మొక్కజొన్నను తగ్గించిన రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు. గతంలో ఎన్నడూ సాగుచేయని విధంగా ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను వేశారు. జిల్లాలో మొత్తం 5.10 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా 3.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. గతంలో ఇంత మొత్తంలో ఎప్పుడూ వరి సాగు కాలేదు. గత సంవత్సరం వానాకా లంలో కూడా 3 లక్షల 50 వేల ఎకరాల్లో సాగైంది.


ఇంకా రైతులు కొన్ని గ్రామాల పరిధిలో పంటలను వేస్తున్నారు. మరో వెయ్యి ఎకరాల వరకు ఈ విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. వ రి పంట సులభం కావడం, ఎక్కువ పని ఉండకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపారు. మొక్కజొన్న, పసుపు పంటలను త గ్గించారు. గత సంవత్సరం వానాకాలంలో  మొక్కజొన్న పంట 50 వేల ఎకరాల్లో వరకు వేయగా ఈ సంవత్సరం కేవలం 21 వేల ఎకరాలలో మాత్రమే వేశారు. పసుపు పంట కూడా ఈ ఏడాది తగ్గింది. గత సం వత్సరం 50 వేల ఎకరాల్లో వేయగా ఈ ఏడాది 35 వేలు మించలేదు. రైతులు ఈ దఫా ఎక్కువగా వరి, సోయా పంటల వైపు మళ్లారు. 


పెరిగిన ఎరువుల వినియోగం..

జిల్లాలో లాభదాయక పంటలలో భాగంగా వరి విస్తీర్ణం పెరగడంతో ఎరువుల వినియోగం బాగా పెరిగింది. జిల్లాలో ఈ వానాకాలం 67 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేయ గా ఇప్పటికే 58 వేల మెట్రిక్‌ టన్నులు జిల్లాకు వచ్చింది. సహకార సొ సైటీలు, ఫెర్టిలైజర్‌ దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. వరి ఎక్కువ సాగు చేయడం వల్ల యూరియా అధికంగా వాడుతున్నా రు. జూన్‌లో వేసిన వరి పొట్ట దశలో ఉండడంతో యూరియా బాగా పె రిగింది. కొన్ని మండలాల పరిధిలో కొరత ఏర్పడుతోంది. కొన్ని సొసైటీల పరిధిలో రైతులకు రెండు బస్తాలను ఇస్తున్నారు. అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తెప్పించే ప్రయత్నం చేస్తు న్నారు. ఒకటి రెండు రోజుల్లో వ్యాగన్ల ద్వారా జిల్లాకు యూరియా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


జిల్లా అంతటా వర్షం..

వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అక్కడక్కడ జల్లులు, కొన్ని చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షం కురి సింది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి. జిల్లాలో సరాసరి 31.3 మి.మీల వర్షం నమోదైంది. భీమ్‌గల్‌ మండలంలో 51 మి.మీ.ల వర్షం పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 558 మి.మీల వర్షం పడాల్సి ఉండగా 515 మి.మీల వర్షం పడిం ది. నాలుగు మండలాల్లో సగటు వర్షానికి మించి వర్షం పడింది. 19 మండలాల్లో సాధారణ వర్షం నమోదు కాగా 6 మండలాల్లో సగటు కన్నా తక్కువ వర్షం పడింది.


వరి విస్తీర్ణం పెరిగింది..

జిల్లాలో ఈ దఫా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. లాభదాయక పంటలలో భాగంగా రైతులు వరిని ఎక్కు వగా వేశారు. రైతులకు కావాల్సిన ఎరువులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రైతులు మోతాదు మించకుండా పంటలకు అవసరమైనంతనే ఎరువులు వేయాలి. 

- గోవింద్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Updated Date - 2020-08-14T11:14:09+05:30 IST