ఘనంగా ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-14T06:08:42+05:30 IST

తెలుగు సంవత్సరాది అయిన ప్లవనామ సంవత్సరాన్ని జల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా ఉగాది వేడుకలు
మోర్తాడ్‌లో పంచాంగ శ్రవణం చేస్తున్న దృశ్యం

నిజామాబాద్‌కల్చరల్‌, ఏప్రిల్‌ 13: తెలుగు సంవత్సరాది అయిన ప్లవనామ సంవత్సరాన్ని జల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా ఆల యాల్లో ఏకాంతంగా నిర్వహించగా వేడుకలను ఇళ్లకే పరిమితం చే సుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రామాలు మొదలుకొని జిల్లాకేంద్రం వరకు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో ప్రతిసారి జరగాల్సిన కవి సమ్మేళనాలు నిర్వహించలేదు. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ పఠనాలు, సంవత్సరపు రాశీ ఫలితాలను పండితులు వివరించారు. మంగళవారం రావడంతో ఆంజనేయస్వామి ఆలయాల్లో సిందూర పూజలు, ఆకు పూజలు, వడ పూజలు నిర్వహించారు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో పలు రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నీలకంఠేశ్వర ఆలయం, శంభులింగేశ్వర ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రం, జెండా బాలాజీమందిర్‌, పెద్దరాంమందిర్‌, సుభాష్‌నగర్‌ రామాలయం, లక్ష్మీ గణపతి ఆలయం, అపురూప వెంకటేశ్వరస్వామి, ఆలయం, నర్సింగ్‌పల్లి లక్ష్మీవెంకటేశ్వర ఆలయం, బోధన్‌ చక్రేశ్వర ఆలయం, తిరుమల లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు మాస్కులు ధరించి ఈ సంవత్సరం కొవిడ్‌ మహమ్మారి నుంచి మానవాళిని దూరం చేసేవిధంగా ఆశీస్సులు అందజేయాలని వేడుకుంటూ పూజించారు. 

Updated Date - 2021-04-14T06:08:42+05:30 IST