ఓ ఆర్‌ఎం‌పీ అద్భుత ఆవిష్కరణ..

ABN , First Publish Date - 2021-04-13T23:17:23+05:30 IST

హయత్‌నగర్‌కు చెందిన ఓ ఆర్‌ఎం‌పీ డాక్టర్ 1200 సంవత్సరాలకు సంబంధించిన పంచాంగాన్ని తయారు చేశారు.

ఓ ఆర్‌ఎం‌పీ అద్భుత ఆవిష్కరణ..

అద్భుత ఆలోచనతో మైమరపిస్తున్న డాక్టర్ పున్న మల్లేశం


హైదరాబాద్: హయత్‌నగర్‌కు చెందిన ఓ ఆర్‌ఎం‌పీ డాక్టర్ 1200 సంవత్సరాలకు సంబంధించిన పంచాంగాన్ని తయారు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న మల్లేశం వృత్తి రీత్యా హాయత్‌నగర్‌లో ఆర్‌ఎం‌పీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. కాగా తన ట్యాలెంట్‌తో వివిధ ప్రయోగాలు చేస్తుంటారు. తనకు వచ్చిన ఆలోచనతో 12వందల సంవత్సరాలకు ఉపయోగపడేలా ఈ పంచాంగాన్ని ఆవిష్కరించారు. 1501 ఏళ్ల నుంచి 2700 వరకు ఈ పంచాంగంలో చూసుకోవచ్చని మల్లేశం చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి ఆర్బాటం లేకుండా ఇంట్లోనే ఈ పంచాంగాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మల్లేశం ప్రారంభించారు.


 ఇందులో సాధారణ సంవత్సర పంచాంగంలాగానే వారం, తిథి, నక్షత్రం, రాశిచక్రం, రాహుకాలం, యమగండం, ధూర్ముహూర్తాలు, హోరాకాలం, తారాబలం ఇలా ఏదైనా చూసుకునే విధంగా ఈ పంచాంగాన్ని ఆర్‌ఎం‌పీ డాక్టర్ మల్లేశం ఆవిష్కరించారు. గతేడాది మార్చ్‌లో కరోన కారణంగా లాక్‌డౌన్ ఏర్పడడంతో ఈ సమయాన్ని వృథా చేయొద్దని తనకు వచ్చిన కొత్త ఆలోచనతో ఏడాది కాలం పాటు శ్రమించి ఈ పంచాంగాన్ని పేపర్, గ్లాస్‌ మెటీరియల్స్‌తో ఒకే ప్రేమ్‌లో రూపొందించారు. ఈ పంచాంగాన్ని ఆవిష్కరించడంతో డాక్టర్ మల్లేశానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం లభించింది. తనకు ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తే సమాజానికి ఉపయోగపడే ఇలాంటి పంచాంగాలను ఎన్నో తయారు చేస్తానని మల్లేశం పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-13T23:17:23+05:30 IST