ఓటీఎస్‌ పేరుతో జగన్‌ దోపిడీ

ABN , First Publish Date - 2021-12-07T04:47:22+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి జగన్‌ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు.

ఓటీఎస్‌ పేరుతో జగన్‌ దోపిడీ
అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్నఅశోక్‌రెడ్డి, ఇతర నేతలు, కనిగిరిలో అంబేద్కర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు,


ఒక్క రూపాయి కూడా కట్టొద్దు

టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత రిజిస్ట్రేషన్లు

పేద గృహ లబ్ధిదారులకు నేతల భరోసా

పలుచోట్ల నిరసనలకు దిగిన శ్రేణులు


గిద్దలూరు, డిసెంబరు 6 : ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి జగన్‌ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేదలకు పక్కా గృహాలు నిర్మించగా, ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు కూడా మరికొన్ని ఇల్లు కట్టించారని చెప్పారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పేదలకు ఒక్క ఇంటిని మంజూరు చేయకపోగా, గతంలో ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి డబ్బులు గుంజుకోవడంపై ధ్వజమెత్తారు. డబ్బులు కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని వలంటీర్లతో బెదిరించడం వంటి చర్యలు రౌడీరాజ్యానికి నిదర్శనమన్నారు.  ఓటీఎస్‌ కింద పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని అశోక్‌రెడ్డి చెప్పారు. అనంతరం అంబేడ్కర్‌ చిత్రపటానికి అశోక్‌రెడ్డి, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి షేక్‌ మహబూబ్‌బాషా, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌, నాయకులు పందీటి రజనిబాబు, గుర్రం డానియేలు, కొండయ్యయాదవ్‌, బిల్లా రమేష్‌, సాయినాథ్‌, రాఘవేంద్ర, దూదేకుల దస్తగిరి పాల్గొన్నారు. 


వైసీపీది అరాచక పాలన : ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, డిసెంబరు 6 : రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు జీవించే హక్కును జగన్‌ హరించివేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు విమర్శించారు. ఎర్రగొండపాలెం ప్రధాన సెంటర్‌లో ఓటీఎస్‌ అక్రమ వసూళ్లను నిరిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం ముందు టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు. జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 


టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత రిజిస్ట్రేషన్లు

కనిగిరి, డిసెంబరు 6 : ఓటీఎస్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం పేద ప్రజల నుంచి దోపిడీ చేస్తోందని, ఇకనైనా వేధించడం మానుకోవాలని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం స్థానిక ఒంగోలు బస్టాండ్‌  కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందచేసి నిరసన తెలిపారు. తొలుత బాబా అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ కల్పించిన జీవించే హక్కును జగన్‌రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజలను వేధిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెద్దఎత్తున దాడులకు దిగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు వీవీఆర్‌ మనోహరరావు, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, బుల్లా బాలబాబు, ఫిరోజ్‌, షడ్రక్‌, మధు, రోషన్‌ సందాని, షంషేర్‌ అహ్మద్‌, గండికోట రమేష్‌, రిజ్వాన్‌, ముంగమూరి శ్రీను, నరసింహా, కోటా సురేష్‌, కేవిఎస్‌ గౌడ్‌, మణికంఠ, చెన్నయ్య, తిరుపాలు, దానియేలు, మోజేస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 11వ వార్డు దేవాంగ్‌నగర్‌లో ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. 


పామూరు : పేద ప్రజలు ఎప్పుడో కట్టుకున్న కాలనీలను ఇప్పుడు హక్కుపత్రాల పేరిట రూ. 10వేలు కట్టమని రాష్ట్ర ప్రభుత్వం హింసించడం సరికాదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరి పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓటీఎ్‌సను నిరసిస్తూ నినాదాలు చేసి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో కే సుభాషిణి, ఖాజారహంతుల్లా, యూ హరిబాబు, బీవీ భోజయ్యచారి, సత్యం, ఎన్‌ సాంబయ్య, ఎం రమణయ్య, దేవరపు మాల్యాద్రి, దైండే శివశింకర్‌, షేక్‌ గౌస్‌బాష, డోలా శేషాద్రి, టివికే సుబ్బారావు, ఇర్రి కోటిరెడ్డి, శేషం మోసే తదితరులు పాల్గొన్నారు.


వెలిగండ్ల : ఓటీఎ్‌సను వ్యతిరేకిస్తూ వెలిగొండలో టీడీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఇంద్రభూపాల్‌రెడ్డి, సలోమన్‌రాజు, కొండు భాస్కర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, మీనిగ కాశయ్య, కేసరి రమణారెడ్డి, మాల్యాద్రి, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఓటీఎస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ధర్నా

కురిచేడు, డిసెంబరు 6 : ఓటీఎ్‌సకు వ్యతిరేకంగా కురిచేడు మండల టీడీపీ నాయకులు సోమవారం వినుకొండ రోడ్డులో ధర్నా నిర్వహించారు. పేదలు కష్టపడి నిర్మించుకున్న గృహాలు నిర్మించుకుంటే వారిని రూ.10 వేలు కట్టమని బలవంతం చేయడం ఏమిటని టీడీపీ మండల నాయకులు మొఘల్‌ మస్తాన్‌వలి ప్రశ్నించారు. కార్యక్రమంలో గడ్డం బాలయ్య, దాసరి రవి, దాసరి ఏడుకొండలు, సుంకర గాలిబ్‌ రావు, గంధం గురునాధం, దాదాసాహెబ్‌, చెన్నయ్య, ఇజ్రాయేలు, మోషే పాల్గొన్నారు. 


మరోమారు జన్మించండి.. అంబేద్కర్‌కు వినతి 

కొండపి, డిసెంబరు 6 : జగనన్న గృహ హక్కు పేరుతో బడుగు, బలహీన వర్గాల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం అరాచకాల నుంచి కాపాడేందుకు మరోమారు మీరు జన్మించాలని విజ్ఞప్తి చేస్తూ కొండపిలోని ఎస్సీకాలనీలో అంబేద్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు వినతిపత్రం సోమవారం ఉదయం అందజేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు రుణ విముక్తి అంటూ డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. ప్రధానంగా ఎస్సీ, బీసీ, బలహీన వర్గాల వారికే ఓటీఎస్‌ వల్ల ఇబ్బందని విమర్శించారు. ఎవరూ డబ్బు కట్టొద్దని, టీడీపీ ప్రభుత్వం రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి ఇస్తామని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో గొర్రెపాటి రామయ్యచౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమందనాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి యనమద్ని వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సెల్‌ మాజీ జిల్లా కమిటీ మెంబర్‌ వై. వెంకటేశ్వర్లు, గోవర్ధన్‌ పాల్గొన్నారు. 

కామేపల్లి... జరుగుమల్లి మండలంలోని కామేపల్లి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, సీనియర్‌ నాయకుడు పోటు పెదబాబు, డి.సుబ్బారెడ్డి, సోమయ్య, కోనూరు సుబ్బారావు, పూర్ణ పాల్గొన్నారు. 

టంగుటూరు... టంగుటూరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు ఓటీఎ్‌సకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కాట్రగడ్డ అనిల్‌ నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-07T04:47:22+05:30 IST