ఆ ఎంబీబీఎస్ కుర్రాడికి 6 నెలలకే వైద్య వృత్తిపై విరక్తి పుట్టింది.. కలెక్టరయ్యాక ఆ ఉన్నత ఉద్యోగాన్నీ వదిలేశాడు.. 22 ఏళ్ల వయసులో ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-12-12T14:31:34+05:30 IST

'ఉద్యోగం' అనేది చదువుకున్నవారి వ్యక్తిత్వానికి గుర్తింపుగా..

ఆ ఎంబీబీఎస్ కుర్రాడికి 6 నెలలకే వైద్య వృత్తిపై విరక్తి పుట్టింది.. కలెక్టరయ్యాక ఆ ఉన్నత ఉద్యోగాన్నీ వదిలేశాడు.. 22 ఏళ్ల వయసులో ఏం చేశాడంటే..

'ఉద్యోగం' అనేది చదువుకున్నవారి వ్యక్తిత్వానికి గుర్తింపుగా మారిన నేటి యుగంలో ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేసి, తమకు ఇష్టమైన వ్యాపారాన్ని చేపట్టేవారు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. 16 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 18 సంవత్సరాల వయస్సులో ఒక సంస్థ కోసం పరిశోధనా పత్రాన్ని రాసి, తన 22 సంవత్సరాల వయస్సులోనే అన్‌అకాడెమీ సహ వ్యవస్థాపకునిగా మారిన రోమన్ సైనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


చిన్నతనం నుంచే అద్భుత ప్రతిభా సంపన్నుడైన రోమన్ సైనీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్ నిర్వహించిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎయిమ్స్‌లో ప్రవేశం పొందిన దేశంలోనే అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఎమ్‌బిబిఎస్‌లో ప్రవేశం కోసం ఎయిమ్స్, ఢిల్లీ నిర్వహించే పరీక్ష అత్యంత కఠినమైనదిగా చెబుతుంటారు. ఎంబీబీఎస్ పూర్తిచేశాక 6 నెలల పాటు వైద్యునిగా పనిచేసిన రోమన్ సైనీ సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి సారించాడు. మొదటి ప్రయత్నంలోనే ఐఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రోమన్ సైనీ మధ్యప్రదేశ్‌లో నియమితులయ్యాడు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేని ఆయన అధ్యాపకుని అవతారం ఎత్తారు. టీచింగ్ వైపు పయనం ప్రారంభించారు. తన స్నేహితులు గౌరవ్ ముంజాల్, హిమాన్షు సింగ్‌తో కలిసి అన్‌అకాడెమీని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన  విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్న ఉద్దేశంతోనే అన్‌అకాడెమీని స్థాపించినట్లు రోమన్ సైనీ తెలిపారు. ఈ అనాకాడెమీ ప్రస్తుతం 14 వేల కోట్ల మార్కెట్ విలువను కలిగివుంది. అలాగే 18 వేలమంది ఉపాధ్యాయుల నెట్‌వర్క్‌తో భారతదేశంలోనే అతిపెద్ద టెక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌గా అన్‌అకాడెమీ కొనసాగుతోంది.

Updated Date - 2021-12-12T14:31:34+05:30 IST