రూ.3.46 కోట్లు హుష్‌కాకి?

ABN , First Publish Date - 2021-06-18T05:15:30+05:30 IST

నారాయణపేట స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూ సేకరణ) కార్యాలయంలో భారీ కుంభకోణం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

రూ.3.46 కోట్లు హుష్‌కాకి?
వెంకటయ్య, శంకర్‌, లక్ష్మణ్‌ (ఫైల్‌)

- నారాయణపేట భూ సేకరణ కార్యాలయంలో భారీ కుంభకోణం 

- కార్యాలయ సిబ్బందే సుత్రాధారులుగా అనుమానం


నారాయణపేట టౌన్‌, జూన్‌ 17 : నారాయణపేట స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూ సేకరణ) కార్యాలయంలో భారీ కుంభకోణం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కార్యాలయంలోనే పని చేస్తున్న ఓ ఉన్నతాధికారితో పాటు ఓ కింది స్థాయి ఉద్యోగి, ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది గతంలో నారాయణపేట ఆర్డీవోగా పని చేసిన చీర్ల శ్రీనివాస్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.3.46 కోట్లు డ్రా చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్డీవో వెంకటేశ్వర్లు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఫోర్జరీ సంతకాలు చేసిన సిబ్బందిని రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కుంభకోణంలో ఆ నలుగురే ఉన్నారా, ఇతర అధికారుల ప్రమేయం ఉన్నదా? అనే దానిపై విచారణ జరుగుతోంది. ప్రస్తుత ఆర్డీవో  గతంలో విధులు నిర్వహించిన చీర్ల శ్రీనివాసులును కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు సుంకిని రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ కుంభకోణం విషయం బయటకు రాకుండా, అధికారులు రహస్యంగా ఉంచడంపై జిల్లా వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సమాచారాన్ని మీడియాకు కూడా తెలియకుంగా గోప్యంగా ఉంచుతున్నారు. కాగా, ఈ విషయంపై ఆర్డీవో వెంకటేశ్వర్లును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, తనకు తెలియదని తాను హైదరాబాద్‌లో ఉన్నానని సమాధానం ఇచ్చారు.


మైనింగ్‌ ఏడీ సంతకం ఫోర్జరీలో ముగ్గురి రిమాండ్‌


రాజాపూర్‌ : ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిని లారీని బయటకు తీసుకొచ్చేందుకు కొందరు చనిపోయిన ఓ మైనింగ్‌ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి, సదరు వ్యక్తులను విచారించడంతో చేసి న నేరాన్ని ఒప్పుకొని కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ లెని న్‌గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం ఈద్గాన్‌పల్లి గ్రామానికి చెందిన దండు వెంకటయ్యకు ఓ లారీ ఉంది. ఈ లారీలో గత నెల 23న అక్రమంగా ఇ సుకను తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. అనంతరం లారీని జిల్లా మై నింగ్‌ అధికారులకు రిపోర్ట్‌ చేశారు. అయితే, పట్టుబడిన లారీని బయటకు తీ సుచ్చేందుకు దండు వెంకటయ్య అదే గ్రామానికి చెందిన జటావత్‌ శంకర్‌ ఆ శ్రయించాడు. ఇద్దరూ కలిసి ఇదే మండలం సేవ్యానాయక్‌తండాకు చెందిన జ టావత్‌ లక్ష్మణ్‌ను కలిసి లారీని విడిపించేందుకు ప్లాన్‌ వేశారు. గత నెల 25న మైనింగ్‌ శాఖకు సంబంధించినదిగా నకిలీ లెటర్‌ను సృష్టించారు. అందులో రూ.36,600 జరిమానా కట్టినట్లు రిలీజ్‌ ఆర్డర్‌ తీసుకొని, ఆ ఆర్డర్‌ కాపీలో జిల్లా మైనింగ్‌ ఏడీగా ఉంటూ గత నెల 8న అనారోగ్యంతో మృతి చెందిన మోహన్‌లా ల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అదే రోజు ఈ కాపీని పోలీస్‌ స్టేషన్‌లో సమర్పిం చి లారీని తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు అనుమానం రావడంతో ఎస్‌ఐ ముగ్గురిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించాడు. మూడు రోజుల పాటు విచారణ చే సిన అనం తరం ము గ్గురూ చే సిన నేరా న్ని ఒప్పు కున్నారు. జటావత్‌ లక్ష్మణ్‌ రా జాపూర్‌ లోని రెవె న్యూ కా ర్యాల యం వద్ద ఉన్న తన దుకాణం లోని కంప్యూటర్‌లో మైనింగ్‌ శాఖకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించామని, చనిపోయిన ఏడీ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. ఈ విషయంపై ప్రస్తుత మైనింగ్‌ ఏడీ విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ముగ్గురిని రిమాం డ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-06-18T05:15:30+05:30 IST