నెలనెలా రూ.400... ఇప్పుడేమో రూ.1.21 లక్షలు

ABN , First Publish Date - 2021-11-13T05:54:43+05:30 IST

సాంకేతిక లోపమో.. రీడింగ్‌ న మోదు చేయడంలో పొరపాటో తెలియదు కానీ.. ప్రతీనెల రూ. 400 దాటని ఇంటికి కరెంటు బిల్లు రూ.1.21 లక్షలు రావడంతో ఆ ఇంటివారు నివ్వెరపోయారు.

నెలనెలా రూ.400... ఇప్పుడేమో రూ.1.21 లక్షలు

సిద్దిపేట/చేర్యాల: సాంకేతిక లోపమో.. రీడింగ్‌ నమోదు చేయడంలో పొరపాటో తెలియదు కానీ.. ప్రతీనెల రూ. 400 దాటని ఇంటికి కరెంటు బిల్లు రూ.1.21 లక్షలు రావడంతో ఆ ఇంటివారు నివ్వెరపోయారు. చేర్యాలలో జరిగి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చేర్యాల అభయాంజనేయస్వామి ఆలయ వీధిలోని ఇంటి నంబరు 23-80లో (సర్వీస్‌ నం. 1300101048) శుక్రవారం కరెంటు మీటరు రీడింగ్‌ తీయగా 12,868 యూనిట్లు వినియోగించినట్టు సూచిస్తూ రూ.1,21,668 బిల్లు వేశారు. ప్రతీనెల రూ. 400 లోపు బిల్లు వస్తుందని, ఈ నెల ఏకంగా లక్షకుపైగా బిల్లు రావడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటని పరీక్షించగా అక్టోబరు 7వ తేదీ నుంచి 36 రోజులకు 218 యూనిట్ల విద్యుత్‌నే వినియోగించగా రీడింగ్‌లో ఎక్కువగా నమోదైంది. దీంతో విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-11-13T05:54:43+05:30 IST