పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీకి ఇబ్బందులు: Sajjanar

ABN , First Publish Date - 2021-12-01T19:44:40+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో టీఎస్ఆర్టీసీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీకి ఇబ్బందులు: Sajjanar

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో టీఎస్ఆర్టీసీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆర్టీసీ ఎండీ  సజ్జనార్ అన్నారు. కరోనా కారణంగా ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. విడి భాగాలు, ఇతర ముడి సరుకుల రేట్లు పెరిగాయన్నారు. గతేడాది టీఎస్ఆర్టీసీకి రూ.2,300 కోట్ల నష్టం కలిగినట్లు వెల్లడించారు. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సజ్జనార్ తెలిపారు. 

Updated Date - 2021-12-01T19:44:40+05:30 IST