ఆంక్షలు పాటించాల్సిందే : జేసీ కృష్ణవేణి

ABN , First Publish Date - 2021-04-23T01:58:34+05:30 IST

రోజు,రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సూచించిన ఆంక్షలు ప్రతి ఒక్కరూ పాటించాలని జేసీ కృష్ణవేణి పేర్కొన్నారు.

ఆంక్షలు పాటించాల్సిందే : జేసీ కృష్ణవేణి
సమావేశంలో మాట్లాడుతున్న జెసీ కృష్ణవేణి

చీరాల, ఏప్రిల్‌ 22 : రోజు,రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సూచించిన ఆంక్షలు ప్రతి ఒక్కరూ పాటించాలని జేసీ కృష్ణవేణి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ ఏసయ్య అధ్యక్షతన మున్సిపల్‌, పోలీస్‌, రెవెన్యూ, మెడికల్‌, దుకాణాల నిర్వహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబులు మాట్లాడుతూ సమష్టి అభిప్రాయాలతో నిర్ణయం తీసుకుని కరోనా కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. జేసీ కృష్ణవేణి మాట్లాడుతూ కలెక్టర్‌ నిర్ణయాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వ్యాపారులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని కొందరు, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాపారాలు చేసుకునే అవకాశఽం కల్పించాలని మరికొందరు కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి   నిర్ణీత సమయాలను నిర్దేసిస్తామన్నారు. ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణతో ముందుగు సాగాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహ్మద్‌ హుస్సేన్‌, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు రాజమోహన్‌, పాపారావు, రెవెన్యూ, మెడికల్‌, మున్సిపల్‌ తదితర విభాగాల బాధ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T01:58:34+05:30 IST