Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిబంధనలు కఠినతరం

కొవిడ్‌ మందులు బ్లాక్‌లో విక్రయాలపై నిఘా

26,792 కేసులు నమోదు

ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ 

ఒంగోలు (క్రైం), జూన్‌2: జిల్లాలో కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేసినట్లు ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ తెలిపారు. ఆంక్షలు అతిక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన ఒంగోలు నగరంలో ద్విచక్రవాహనంపై పర్యటిస్తూ కర్ఫ్యూను పరిశీలించారు. కొవిడ్‌ ఆసుపత్రులు, మందుల దుకాణాలను తనిఖీ చేశారు. బ్లాక్‌లో కొవిడ్‌ మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో అధికగా ఫీజులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గతనెల 5 నుంచి ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించిన వారిపై 26,792 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటిలో విపత్తు నిర్వహణ చట్టం కింద 1,665, దుకాణాలు, హోటల్స్‌పై 6041 కేసులు నమోదు చేసి రూ.16,04,615 జరిమానా విధించినట్లు చెప్పారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 19,086 కేసులు నమోదు చేసి రూ.21,25,505 వసూలు చేసినట్లు వివరించారు. అంతేకాకుండా 3,427 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసాద్‌, ఎస్బీ డీఎస్పీ ఎం.మరియదాసు, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎన్‌.సురేష్‌, ఒంగోలు తాలుకా, టూటౌన్‌ సీఐలు శివరామకృష్ణరెడ్డి, రాజేష్‌ ఉన్నారు.


Advertisement
Advertisement