కొత్తపట్టణం భూములపై బహిరంగ విచారణ

ABN , First Publish Date - 2021-06-18T03:38:50+05:30 IST

: కోట మండలం కొత్తపట్టణంలోని 260 ఎకరాల డీకేటీ, అసైండ్‌ భూములకు సంబంధించి స్థానిక తహసీల్దారు

కొత్తపట్టణం భూములపై బహిరంగ విచారణ
: రైతును విచారిస్తున్న ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి


కోట, జూన్‌ 17 : కోట మండలం కొత్తపట్టణంలోని 260 ఎకరాల డీకేటీ,  అసైండ్‌ భూములకు సంబంధించి స్థానిక తహసీల్దారు కార్యాలయంలో గురువారం బహిరంగ విచారణ జరిగింది. ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి,  తహసీల్దారు రమాదేవి,  ఆర్‌ఐ సతీష్‌కుమార్‌లు సుమారు 100 మంది రైతులను  విచారించారు. కొత్తపట్టణం సర్వేనెంబరు 760లో సుమారు 266 ఎకరాల డీకేటీ, అసైండ్‌ భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి భోగస్‌ అనుభవదారు పట్టాలు పొంది పరిహారం స్వాహాచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వెంటనే ఆపాలంటూ కొంతమంది జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల  మేరకు ఆర్డీవో చైత్రవర్షిణి బహిరంగ విచారణ చేపట్టి రైతువారీగా పాసుపుస్తకాలు, పట్టాలను పరిశీలించారు. 


Updated Date - 2021-06-18T03:38:50+05:30 IST