ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన మార్పులేమిటి? శివసేన సవాల్

ABN , First Publish Date - 2020-10-28T19:51:12+05:30 IST

ఆర్టికల్ 370పై సామ్నా వేదికగా శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో వచ్చిన మార్పులు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన మార్పులేమిటి? శివసేన సవాల్

ముంబై : ఆర్టికల్ 370పై సామ్నా వేదికగా శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో వచ్చిన మార్పులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసింది. 370 ని రద్దు చేసిన తర్వాత ఒక్క రూపాయి పెట్టుబడులు కూడా రాలేదని, నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరకలేదని మండిపడింది. ఈ విషయంలో స్థానికులను నేతలు పూర్తిగా తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. లాల్‌చౌక్‌లో తిరంగా జెండాను ఎగరవేస్తున్న కొందరు యువకులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేసింది. ముంబైను పీఓకేతో పోల్చిన వారికేమో కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని, అదే లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే యువకులను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారని ఎద్దేవా చేసింది.


లాల్‌చౌక్‌లో జెండా ఎందుకు ఎగరవేయకూడదో దేశ ప్రజలందరూ తెలుసుకోవాలని భావిస్తున్నారని, 370 రద్దు తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఏమీ మారలేదని ఇట్టే స్పష్టమౌతోందని మండిపడింది. ముంబైలో త్రివర్ణ పతాకాన్నిఎగుర వేస్తారని, దీనర్థం ఇది పాక్ కాదని, కానీ... పాకిస్తాన్ జోక్యం ఉన్న చోట మాత్రం త్రివర్ణ పతాకాన్ని అవమానించారని శివసేన మండిపడింది. 370 విషయంలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశద్రోహం కిందికే వస్తాయని సామ్నా వేదికగా శివసేన స్పష్టం చేసింది. 

Updated Date - 2020-10-28T19:51:12+05:30 IST