శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2021-01-14T12:59:20+05:30 IST

అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంది.

శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం

కేరళ: అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంది. ఈ సందర్భంగా గురువారం అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని ఆశపడతారు. మకరజ్యోతిని వీక్షించి, తరించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు. 

Updated Date - 2021-01-14T12:59:20+05:30 IST