Advertisement
Advertisement
Abn logo
Advertisement

సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య

15 రోజుల కిందటే వివాహం

తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక అఘాయిత్యం

అనంతపురం క్రైం, నవంబరు 30: నగర శివారులోని బళ్లారిబైపాస్‌ సమీపా న ఇండసి్ట్రయల్‌ ఎస్టేట్‌లో నివాసముంటున్న సచివాలయ ఉద్యోగిని సాయిసుజన (22) సోమవారం రాత్రి ఉరేసుకుం ది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలి వి. హెడ్‌కానిస్టేబుల్‌ సూర్యనారాయణ, శశికళ దంపతుల కుమార్తె సాయిసుజన బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తుండేది. తండ్రి సూర్యనారాయణ గార్లదిన్నె పోలీసుస్టేషనలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 17న కనగానపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన మెడికల్‌ రెప్‌ విశ్వనాథతో పెద్దల సమక్షంలో సాయిసుజనకు వివాహం చేశారు. నాలుగు రోజుల క్రితం భర్తతో కలసి సాయిసుజన పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలో మెట్టింటికి వెళ్లమని తల్లిదండ్రులు ఆమెను ఒత్తిడి చేశారు. సాయిసుజనకు తల్లిదండ్రులపై అమితమైన ప్రేమ ఉండటంతో వారిని వదిలి అత్తారింటికి వెళ్లలేక తీవ్ర మనస్తా పం చెందింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో బాతరూంలోకి వెళ్లి, చున్నీతో ఉరేసుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారంతో అనంతపురం రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాల వారు, బం ధువులు ఆసుపత్రికి చేరుకుని, బోరున విలపించారు. వివాహమైన 15 రోజుల్లోనే సాయిసుజన ఆత్మహత్యకు పాల్పడటం తీరని విషాదం నిం పింది. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement