పాలకుల దాడిని తిప్పికొడదాం

ABN , First Publish Date - 2022-03-12T05:34:35+05:30 IST

గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని కార్మికవర్గంపై పాలకులు చేస్తున్న దాడిని తిప్పికొడదామని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షుడు సాయిబాబా పిలుపు నిచ్చారు.

పాలకుల దాడిని తిప్పికొడదాం
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబా

- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబా

గద్వాల టౌన్‌, మార్చి 11 :  గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని కార్మికవర్గంపై పాలకులు చేస్తున్న దాడిని తిప్పికొడదామని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షుడు సాయిబాబా పిలుపు నిచ్చారు.  అందుకు కార్మికులందరూ సంఘటితం కావాలని చెప్పారు. గద్వాల పట్టణంలోని టీఎన్జీవో భవనంతో శుక్రవారం నిర్వహించిన సీఐటీయూ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల అమలు కోసం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితిని కల్పిస్తున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం చట్టాలు చేయగా, ప్రస్తుత పాలకులు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్‌ శక్తు లకు వంతపాడుతూ దేశభక్తులమని గొప్పలు చెప్పు కోవడం సిగ్గుచేటన్నారు. సంపదను సృష్టించే కార్మికు లను శ్రమ దోపిడీకి గురి చేయడం ఏరకమైన దేశభక్తి అని ప్రశ్నించారు.  ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేయాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ నిరంకుశ విధానాలతో కార్మికులను రోడ్లపైకి తెచ్చిన పాలకులను నిలదీసినప్పుడే న్యాయం జరుగుతుం దన్నారు. ఈ దిశగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దామన్నారు. సమావేశంలో  రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు, జిల్లా నాయకులు వివి నరసింహ, బి.నరసింహ, ఉప్పేరు నరసింహ, ఎల్‌ఐసీ రంగన్న, సీఐటీయూ అనుబంధ సంఘాల నాయ కులు ఎమేలమ్మ, రత్నమ్మ, సరస్వతి గట్టన్న, శివ, అంజి, విజయ్‌, ఈశ్వర్‌, శ్రీను, వేణు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-12T05:34:35+05:30 IST