Abn logo
Aug 5 2020 @ 04:27AM

ఇసుక నిల్వలను బహిరంగ వేలం వేయాలి

జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌


ధర్మపురి, ఆగస్టు 4: మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఇసుక ని ల్వలను బహిరంగ వేలం వేసి అవసరం ఉన్న వారికి సరఫరా చేయాలని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్‌ రవీందర్‌కు మంగళవారం ఆయన వినతి పత్రాన్ని అం దించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం అనేక మంది ని రుద్యోగులు ట్రాక్టర్లు కొనుగోలు చేసి పనులు లేకుండా అప్పుల పాలయ్యా రన్నారు. ప్రభుత్వం వెంటనే మినరల్‌ కార్పొరేషన్‌ ద్వారా ధర నిర్ణయించి ఇసు క నిల్వలను బహిరంగ వేలం వేయించి, ట్రాక్టర్‌ యజమా నులకు కేటాయిం చాలన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్‌, జైనా ఎంపీటీసీ రజిత-సుధాకర్‌, కౌన్సిలర్లు సయ్యద్‌ యూనస్‌, కార్తీక్‌, అరుణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement