జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు

ABN , First Publish Date - 2022-01-17T06:48:03+05:30 IST

జిల్లాలో సంక్రాంతి వేడుకలను సంబురంగా నిర్వహించుకున్నారు. పండుగ వేళ మహిళలు ఉదయాన్నే మేలుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి వేసిన అందమైన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేల తల్లిపై వెల్లువిరిసిన రంగవల్లులతో జిల్లాలోని గ్రామాలు,

జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు
బోథ్‌లో ముగ్గులు వేస్తున్న వృద్ధులు

ఆకట్టుకున్న రంగురంగుల రంగవల్లులు 

పతంగులతో యువకులు, చిన్నారుల కేరింతలు 

బోథ్‌లో వృద్ధులకు ముగ్గుల పోటీలు

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 16: జిల్లాలో సంక్రాంతి వేడుకలను సంబురంగా నిర్వహించుకున్నారు. పండుగ వేళ మహిళలు ఉదయాన్నే మేలుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి వేసిన అందమైన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేల తల్లిపై వెల్లువిరిసిన రంగవల్లులతో జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, మండ ల కేంద్రాల్లో ముగ్గులు మైమరిపించి పోయాయి. ఇళ్ల ముందు హరిదాసుల గానాలు, గంగిరెద్దుల నాట్యాలు, ఇళ్లలో పిండివంటల గుమగుమలు అలరించా యి. తమ సొంతూళ్లకు వచ్చిన బంధువులతో ఇళ్లన్నీ కిటకిటలాడాయి. కాగా సంక్రాంతి పర్వదినాన్నిపురస్కరించుకొని మహిళలు వాయినాలు ఇచ్చుకున్నారు.  

మొదటి విజేతకు రూ.ఐదు వేల బహుమానం

బోథ్‌: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన వృద్ధుల ముగ్గుల పోటీలు ఆలరించాయి. 50 మంది వరకు వృద్ధులు పోటీలలో పాల్గొని ముగ్గులు వేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జి.గంగాదర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 98ఏళ్ల వృద్దురాలు లంక అంబుబాయి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. కాగా నేటి తరానికి పోటీపడి వృద్దులు ముగ్గులు వేయడానికి అభినందిస్తూ బోథ్‌ సీఐ నైలునాయక్‌ తనవంతుగా ఐదు వేల రూపాయలను బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త కత్తురి విశ్వానంద్‌ సహకారం అందించారు. ఇందు లో ఉప సర్పంచ్‌ కట్ట పల్లవితో పాటు మహిళలు పాల్గొన్నారు. 

ఉట్నూర్‌లో అలరించిన ముగ్గుల పోటీలు 

ఉట్నూర్‌: సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్థానిక పోచమ్మ ఆలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన రంగవళ్లుల పోటీలు అలరించాయి. పట్టణానికి చెందిన మహిళలు, బాలికలు ముగ్గుల పోటీలకు హాజరై ము గ్గులు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ అనురాధ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి పండుగలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో విజేతలు కే శిరీష, సాడిగే సుకన్య, కొండేరి పద్మలకు బహుమతులు, మొక్కలను అందించా రు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా పంచాయతీ ఈవో ఉప్పుల సత్యనారాయణతో పాటు బొల్లిగన్నే రాజేశ్వర్‌, పొదిల అనిత, భారతి, వేంపల్లి మాధవి, శ్రీదేవి, రమాదేవి, సాడిగే రాజ్‌గోపాల్‌, హరి కృష్ణ, చిన్న రాజన్న, రాజ్‌కుమార్‌, బలిష్టి రామారావు, దాత్రిక హరీష్‌, సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T06:48:03+05:30 IST