Abn logo
Jul 24 2021 @ 12:26PM

సర్పంచ్‌ను గాడిదపై ఊరేగించిన గ్రామస్తులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ఆ ఊరి సర్పంచ్‌ను గ్రామస్తులందరూ కలిసి గాడిదపై కూర్చోబెట్టారు.. అనంతరం ఊరంతా ఊరేగించారు.. ఈలలు, కేకలూ వేస్తూ ఉత్సాహంగా ఆ గాడిద వెంట నడిచారు.. ఇంతకీ ఆ సర్పంచ్ ఏం తప్పు చేశాడు అనుకుంటున్నారా?.. అతనే తప్పూ చేయలేదు.. తమ ప్రాంతంలో వర్షం కురవకపోవడంతో గ్రామస్తులందరూ కలిసి తమ ఆచారం ప్రకారం ఇలా సర్పంచ్‌ను గాడిపై ఊరేగించారు అంతే.. 


దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా మధ్యప్రదేశ్‌లో మాత్రం ఆశించినంతగా కురవడం లేదు. దీంతో వర్షాల కోసం ఆ రాష్ట్ర ప్రజలు తమ తమ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తున్నారు.  విదిశ జిల్లా రంగై గ్రామానికి చెందిన ప్రజలు తమ సాంప్రదాయం ప్రకారం సర్పంచ్‌ సుశీల్ వర్మను గాడిదపై కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ప్రార్థించారు. కాగా, అదే రాష్ట్రంలో రాట్లం ప్రాంతంలో కూడా ఇలాగే చేశారు. గాడిదపై సర్పంచ్‌ను వెనక్కి తిప్పి కూర్చోబెట్టి ఊరేగించారు. 

ప్రత్యేకంమరిన్ని...