Mecca:గ్రాండ్ మసీదులో మహిళా గార్డుల భద్రత

ABN , First Publish Date - 2021-07-22T18:53:37+05:30 IST

మహిళా సాధికారత దిశగా సౌదీ అరేబియా మరో ముందడుగు వేసింది....

Mecca:గ్రాండ్ మసీదులో మహిళా గార్డుల భద్రత

మక్కా (సౌదీఅరేబియా):మహిళా సాధికారత దిశగా సౌదీ అరేబియా మరో ముందడుగు వేసింది. ఇస్లాం జన్మస్థలమై మక్కా, మదీనాలో యాత్రికులను పర్యవేక్షించే భద్రత సేవల్లో మహిళా గార్డులను నియమించాలని సౌదీ సర్కారు నిర్ణయించింది. ఈ ఏడాది హజ్ యాత్రలో పాల్గొన్న యాత్రికులకు మొట్టమొదటిసారి మహిళా సైనికులు మక్కా, మదీనాల భద్రతా విధులు నిర్వర్తించడం కనిపించింది. ఖాకీ యూనిఫాం ధరించిన సౌదీ మహిళలు మక్కాలోని గ్రాండ్ మసీదులో భద్రతను పర్యవేక్షించారు. లెంగ్త్ జాకెట్, వదులుగా కుట్టిన ప్యాంటు ధరించి, జుట్టును కప్పి ఉంచేలా నల్ల టోపి, మాస్కు ధరించి సౌదీ మహిళలు భద్రతావిధులు నిర్వర్తించారు. భద్రతా విధుల్లో సౌదీ మహిళల ప్రవేశంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. మక్కా చరిత్రలో మొట్టమొదటిసారి భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారని యాత్రికులు ట్వీట్ చేశారు.ఈ ఏడాది 10వేల మంది వ్యాక్సిన్ తీసుకున్న యాత్రికులు సామాజిక దూరం పాటిస్తూ హజ్ యాత్రలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-22T18:53:37+05:30 IST