లఖింపూర్ కేసుపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశం

ABN , First Publish Date - 2021-11-15T20:50:15+05:30 IST

లఖింపూర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందంలో (సిట్) సీనియర్ అధికారుల్ని పెంచి మరింత విస్తృతపర్చమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఈ విషయమై విచారణ చేపట్టిన సీజేఐ ఎన్‌.వి.రమణ..

లఖింపూర్ కేసుపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశం

న్యూఢిల్లీ: లఖింపూర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందంలో (సిట్) సీనియర్ అధికారుల్ని పెంచి మరింత విస్తృతపర్చమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఈ విషయమై విచారణ చేపట్టిన సీజేఐ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అంతే కాకుండా ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఒక జడ్జిని నియమించాలని సూచించింది. అయితే ఈ కేసు దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ అవతలి హైకోర్టు జడ్జి నియామకానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసింది. సుప్రీం సూచన మేరకు పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జీలు రంజిత్ సింగ్ లేదంటే రాకేష్ జైన్‌లలో ఎవరినైనా నియమించొచ్చని, ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకు యూపీ ప్రభుత్వం తరపు లాయర్ స్పష్టం చేశారు. అయితే పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జీ రాకేష్ కుమార్ జైన్‌‌ను నియమించేందుకు కోర్టు సముఖంగా ఉందని, వారిని సంప్రదించిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేస్తామని పేర్కొంది.


అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి అనే జిల్లాలో మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కాన్వాయ్ వెళ్లి నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారు.

Updated Date - 2021-11-15T20:50:15+05:30 IST