Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు.. 13 ప్రాజెక్టులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు, డీఈవో గంగాభవాని తదితరులు

గుంటూరు(విద్య), నవంబరు 30: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో  విద్యార్థులు జాతీయస్థాయిలో ఖ్యాతి చాటాలని పాఠశాల విద్య సంయుక్త సంచాలకుడు వీఎస్‌ సుబ్బారావు సూచించారు. మంగళవారం పాతబస్టాండు సెంటర్‌లోని పరీక్షాభవన్‌లో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లానుంచి మొత్తం ఆఫ్‌లైన్‌లో 200, ఆన్‌లైన్‌లో 50 ప్రాజెక్టులు రావడం అభినందనీయమని తెలిపారు. ఇందులో 13 ప్రాజెక్టులు డిసెంబరు 14, 15 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ ఏఏ మధుకుమార్‌, తెనాలి, బాపట్ల డిప్యూటీ డీఈవోలు ఎం.నారాయణరావు, రవిసాగర్‌, ఉర్దూ డీఐ ఎస్‌కే ఎండీ ఖాసిం పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ డాక్టర్‌ ఎన్‌.అంకమ్మ, ఎన్‌.ప్రవీణకుమారి, జి.క్యాథరిన్‌, కె.అపర్ణసీతారామ్‌, బి.శ్రీదేవి, వై.లక్ష్మీప్రసన్న, ఏ.రవికుమార్‌, ఎ.శ్రీనివాసరావు, సీహెచ్‌ బాలలత, గంగాధర్‌, రాజాబాబు, ఆర్‌.శివనాగేశ్వరరావు తదితరులు వ్యవహరించారు.


Advertisement
Advertisement