Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధిలో సైన్స్‌దే కీలక పాత్ర

నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాంచంద్రయ్య

ముగిసిన జేవీవీ రాష్ట్ర మహాసభలు

నూతన కార్యవర్గం ఎన్నిక


భువనగిరి టౌన్‌, నవంబరు 28: అభివృద్ధిలో సైన్స్‌దే కీలకపాత్ర అని నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాంచంద్రయ్య అన్నారు. భువనగిరిలో ఆదివారం నిర్వహించిన జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. మని షి ప్రతీ పరిణామం వెనుక సైన్స్‌ ఉందన్నారు. భారతీయ సైన్స్‌కు ఘన చరిత్ర ఉన్నా, క్షేత్రస్థాయిలో శాస్త్రప్రగతి మందగించింద ని, ఈ తరహా పరిస్థితి నివారణకు జేవీవీ కృషిచేస్తోందన్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సైన్స్‌ ద్వారానే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. దేశం అన్ని రంగాల్లో పురోగమించాలంటే పాఠశాల విద్య నుంచే సైన్స్‌, పరిశోధనలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సైన్స్‌కు మతం, ఆచారాలు అడ్డంకి కాదని, సంప్రదాయాలు, శాస్త్రీయత వేర్వేరు పరిణామాలన్నారు. సైన్స్‌ను ప్రజల వద్దకు మరింతగా చేరవేసేందుకు మతం అడ్డంకి కారాదనానరు. సైన్స్‌ ప్రచారంలో జేవీవీ కార్యకర్తలు ఈ తరహా ప్రస్తావనలు తేవొద్దని సూచించారు. కాగా, మహాసభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ అందె సత్యం మాట్లాడుతూ, రెండేళ్లలో జేవీవీ సాధించిన విజయాలు, ఉద్యమాలను వివరించారు. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్‌ కోయ వెంకటేశ్వర్‌రావు, టి.శ్రీనాఽథ్‌తో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమాల్లో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.భాస్కరాచారి, కెవి.శ్రీనివాస్‌, దిడ్డి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement