వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-04-11T04:58:39+05:30 IST

మండల పరిధిలోని దోర్నాదుల కాలువకు సమీపంలో ముంబాయి రహదారిపై శనివారం రాత్రి గుర్తుతెలి యని వాహనం ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు

వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

సంగం, ఏప్రిల్‌ 10: మండల పరిధిలోని దోర్నాదుల కాలువకు సమీపంలో ముంబాయి రహదారిపై శనివారం రాత్రి గుర్తుతెలి యని వాహనం ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. రహదారిపై నడిచి వెళుతుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఈ ఘటన జరిగింది. వృద్ధుడి తలకు తీవ్రగాయమై అక్కడికక్క డే మృతిచెందాడు. సుమారు 60 సంవత్సరాల వయసు, గడ్డం, గీర్ల చొక్కా ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనాథ వృద్ధుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2021-04-11T04:58:39+05:30 IST