విత్తన డీలర్లు రిజిస్టర్లు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-12-03T06:18:49+05:30 IST

విత్తన, ఎరువుల డీలర్లు అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు.

విత్తన డీలర్లు రిజిస్టర్లు నిర్వహించాలి
ముత్తిరెడ్డిగూడెంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ

భువనగిరి రూరల్‌, డిసెంబరు 2: విత్తన, ఎరువుల డీలర్లు అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం రైతు వేదిక భవనంలో డీలర్లకు గురువారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రతీ డీలర్‌ తప్పక లైసెన్స్‌ను దుకాణం ఎదుట ప్రదర్శించాలని, స్టాక్‌ బోర్డు ఏర్పాటుచేసి అన్ని వివరాలు పొందుపరచాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు పట్టాదారు, ఆధార్‌ కార్డు ఫొటోస్టాట్‌ ప్రతితో వచ్చి ఎరువులు కొనుగోలుచేయాలన్నారు. సమావేశంలో డీఏవో కె.అనురాధ, ఏడీఏలు వెంకటేశ్వర్‌రావు, దేవ్‌సింగ్‌, పద్మావతి, ఏవోలు, ఏఈవోలు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-03T06:18:49+05:30 IST