రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సాధువు.. చిన్న దెబ్బ కూడా తగలకుండా..

ABN , First Publish Date - 2022-04-13T20:40:58+05:30 IST

ఆ సాధువు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతున్నాడు..

రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సాధువు.. చిన్న దెబ్బ కూడా తగలకుండా..

ఆ సాధువు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతున్నాడు.. అదే సమయంలో వేగంగా రైలు దూసుకొచ్చింది.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సాధువు పట్టాలపైనే పడుక్కుండిపోయాడు.. నిమిషంన్నర పాటు అతడి పై నుంచి రైలు వెళ్లింది.. 20 బోగీలు పై నుంచి వెళ్లిపోయినా అతడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదు.. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. 


గత సోమవారం మన్మాడ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన సాధువు 3వ నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి నాలుగో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఓ ట్రైన్ వేగంగా దూసుకొస్తోంది. ఆ సమయంలో సాధువు సమయస్ఫూర్తిగా వ్యవహరించి పట్టాలపై పడుక్కుండిపోయాడు. నిమిషంన్నర పాటు అతడిపై నుంచి 20 బోగీలు వెళ్లినా అతడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదు. 


పట్టాలపై ఉన్న సాధువును చూసి ఇతర ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. నిమిషం పాటు ఉత్కంఠగా చూశారు. సాధువు సురక్షితంగా బయటకు రావడం చూసి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అక్కడి నుంచి సాధువు బయటకు వెళ్లిపోయాడు. అతడిని గుర్తించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-13T20:40:58+05:30 IST