రాహుల్ నేతృత్వంలో 2024 ఎన్నికలు: శివసేన

ABN , First Publish Date - 2021-12-08T04:01:51+05:30 IST

న్యూఢిల్లీ: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పోటీ చేయబోతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.

రాహుల్ నేతృత్వంలో 2024 ఎన్నికలు: శివసేన

న్యూఢిల్లీ: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పోటీ చేయబోతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. న్యూఢిల్లీలో రాహుల్‌తో సమావేశానంతరం రౌత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలేని విపక్షాల కూటమి అసాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలేని విపక్షాల కూటమి కోసం యత్నిస్తున్న తృణమూల్ అధినేత్రికి మమతా బెనర్జీకి సంజయ్ రౌత్ వ్యాఖ్యలు షాక్ ఇచ్చేవేనని విశ్లేషకులు చెబుతున్నారు. వారం క్రితం మమత ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిసినప్పుడు యూపిఏ ఎక్కడుందని ప్రశ్నించడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ లేని విపక్ష కూటమికే ఆమె పట్టుబడుతుండగా మహారాష్ట్రలో అధికారం పంచుకుంటున్న ఎన్సీపీ- శివసేన కాంగ్రెస్ సారధ్యాన్ని కోరుకుంటున్నాయి. విపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే కూటమిగా ఏర్పడాలని ఎన్సీపీ కోరుకుంటోంది. విపక్ష కూటమిలో సమాజ్‌వాదీ పార్టీని కూడా కలుపుకోవాలని ఎన్సీపీ యోచిస్తోంది. 

Updated Date - 2021-12-08T04:01:51+05:30 IST