Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లా సబ్‌ జూనియర్‌ కబడ్డీ జట్ల ఎంపిక

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 6: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో ఈ నెల 17 నుంచి జరిగే 31వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్‌ ప్రాంగణంలో జరిగిన ఈ ఎంపిక పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 250 మంది బాలురు, 128 మంది బాలికలు పాల్గొన్నారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన ఈ ఎంపిక పోటీలలో బాలుర విభాగంలో 28 మందిని, బాలికల విభాగంలో 21 మందిని ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 16 వరకు శిక్షణనిచ్చి తుది జట్లను ఎంపిక చేయనున్నామని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి ఉరుకూటి రాజేశ్వరి తెలిపారు. ఈ ఎంపిక పోటీలను జాతీయ కోచ్‌ ఎం.ఉమా శంకర్‌బాబు, జాతీయ క్రీడాకారులు పి.అప్పారావు.  ఎం గణపతిరావు,ఎం.నరసింగరావు, పి.శ్రీనివాసరావు, వి.నిరుపమ, వై.యామిని, జి.శివ తదితరులు పర్యవేక్షించారు.


Advertisement
Advertisement