‘సీజనల్‌’పై సీరియస్‌

ABN , First Publish Date - 2021-06-20T04:57:52+05:30 IST

కరోనా వైరస్‌ రెండో దశ ఉధృ తి క్రమంగా తగ్గుతోంది.

‘సీజనల్‌’పై సీరియస్‌
కర్వెన వద్ద కూలీలకు దోమతెరలు అందిస్తున్న మలేరియా అధికారులు

- దోమలు వృద్ధి చెందకుండా ప్రత్యేక ప్రణాళిక

- లక్ష గంబూసియా చేపలను సిద్ధంగా ఉంచిన మత్స్య శాఖ

- పాలమూరు జిల్లాలో అందుబాటులో 340 ఫాగింగ్‌ యంత్రాలు

- 1,130 కుటుంబాలకు అందిన దోమతెరలు


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం), జూన్‌ 19 : కరోనా వైరస్‌ రెండో దశ ఉధృ తి క్రమంగా తగ్గుతోంది. అయితే, ఇదే క్రమంలో వర్షా కాలం ప్రారంభం కావడం తో సీజనల్‌ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులకు కారణమ య్యే దోమలు వృద్ధి చెందకుండా, వాటిపై దాడి చేసేందుకు మహబూబ్‌నగర్‌ జి ల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని మలేరియా విభాగం సిద్ధమవుతోంది. కొన్ని అనుసం ధాన శాఖలతో సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యా చరణ అమలు చేస్తోంది. 


ప్రాజెక్టుల వద్ద ప్రత్యేక దృష్టి

మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణ ప్రాంతాల లో నమోదవుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా, రాజస్తాన్‌ నుంచి వచ్చే వలస కూ లీలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. అందు వల్ల జిల్లాలోని కర్వె న, ఉదండాపూర్‌ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కా ర్యాచరణ రూపొందించారు. ఆ ప్రాంతాల్లోని గ్రామాలలో గుర్తించిన కుటుంబాల కు దోమ తెరలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,130 కుటుంబాలకు దోమతెరలు అందించారు. దీంతో పాటు ఆ ప్రాంతాల్లో కూలీల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అలాగే గ్రామాల్లో, పట్టణాలలో ఫాగింగ్‌ ద్వారా దోమలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా లోని 440 గ్రామ పంచాయితీలు, నాలుగు మునిసిపాలిటీలు ఉండగా, ప్రస్తుతం జిల్లాలో 340 వరకు ఫాగింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఫాగింగ్‌ చే సేందుకు మలాథియాన్‌ ధ్రావనం, లార్వాను అంతం చేసేందుకు టెమిఫాస్‌ ధ్రా వనం కూడా సిద్ధంగా చేసి ఉంచారు.


ఇప్పటి వరకు నమోదైన కేసులు

ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో అక్కడక్కడ దోమ కాటు వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో నాలుగు మలేరియా కేసులు నమోదు కాగా, అం దులో మహబూబ్‌నగర్‌ పట్టణంతో పాటు జడ్చర్ల, భూత్పూర్‌, నవాబ్‌పేటలలో ఉన్నాయి. డెంగీ కేసులు 18 నమోదు కాగా, ఎక్కువ కేసులు భూత్పూర్‌ మండ లంలో నమోదయ్యాయి. 


అందుబాటులో గంబూసియా చేపలు

దోమల లార్వాను అంతం చేసేందుకు జిల్లా మత్య్స శాఖ ఆధ్వర్యంలో గంబూ సియా చేపలను సిద్ధం చేశారు. మొత్తం లక్ష చేపలను కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో ని మత్య్సశాఖ ఆధీనంలో ఉంచారు. అవసరమైతే మరో లక్ష చేపలు కూడా సిద్ధం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ చేపలు దోమల లార్వాను తినే స్తాయి. అందు వల్ల ఈ చేపలను ప్రతీ పీహెచ్‌సీకి అందించి ఆయా గ్రామాల్లోని చిన్న కుంటలు, మురికి కుంటల్లో వదిలేలా ప్రణాళిక రూపొందించారు.

Updated Date - 2021-06-20T04:57:52+05:30 IST