కోవిడ్ థర్డ్ వేవ్.. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

ABN , First Publish Date - 2021-06-14T19:48:32+05:30 IST

కోవిడ్ నేపథ్యంలో సేవాభారతి విశేష సేవలు అందిస్తోంది. దేశం నలుమూలలా కోవిడ్ బాధితులకు ఆసరాగా నిలుస్తోంది. తక్షణ వైద్య సేవలతో పాటు..

కోవిడ్ థర్డ్ వేవ్.. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో సేవాభారతి విశేష సేవలు అందిస్తోంది. దేశం నలుమూలలా కోవిడ్ బాధితులకు ఆసరాగా నిలుస్తోంది. తక్షణ వైద్య సేవలతో పాటు అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్వామి వివేకానందులు చెప్పిన రోగి దేవోభవ వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టింది. తాజాగా కోవిడ్ థర్డ్ వేవ్ రానుందన్న ఆందోళనల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ వేదికగా జూన్ 16న గంటన్నర పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్‌పై ఉన్న అపోహలను తొలగించే చర్యల్లో భాగంగా అపార అనుభవం కలిగిన వైద్యులతో సూచనలు, సలహాలు అందిస్తోంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలరని సేవాభారతి ప్రతినిధులు కోరారు. 


కోవిడ్ థర్డ్ వేవ్‌లో పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమము - LIVE  

 


Updated Date - 2021-06-14T19:48:32+05:30 IST