Abn logo
Oct 23 2020 @ 06:16AM

ఏడుగురు బుకీలు అరెస్టు

రూ.1,12,300లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 22: బెట్టింగ్‌ వ్యవహారంలో భాగంగా డబ్బులు పంచుకుంటుండగా ఎస్‌ఐ నారాయణయాదవ్‌ దాడి చేసి ఏడుగురు బుకీలను అరెస్టు చేసి, వారి నుంచి రూ.1లక్షా 12వేల 300లు, ఏడు సెల్‌ఫోన్లు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు టుటౌన్‌ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం టుటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ వివరాలను వెల్లడిస్తూ వచ్చిన సమాచారం తో ఎస్‌ఐ నారాయణయాదవ్‌ సిబ్బందితో కలిసి నడింపల్లివీధిలోని సమితి ఆఫీసు వద్ద ఏడుగురు బుధవారం రాత్రి జరిగిన  ఐపీఎల్‌ మ్యాచ్‌ సంబంధించి బెట్టింగ్‌ డబ్బు గురువారం ఉదయం పంచుకుంటుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో నడింపల్లివీధి వాసి పసుపుల రసూల్‌, ఆటోనగర్‌కు చెందిన మహమ్మద్‌ హుస్సేన్‌, కోటవీధికి చెందిన బ్రహ్మయ్య, పెన్నానగర్‌కు చెందిన సాధక్‌, ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లికి చెందిన మురళీమోహన్‌రెడ్డి, బాల ఓబయ్యగారివీధికి చెందిన నరసింహరావు, నడింపల్లివీధికి చెందిన హజ్మతుల్లాలున్నారన్నారు. వీరి నుంచి లక్షా 12వేల 300 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, బెట్టింగ్‌ పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ  వివరించారు. ఎస్‌ఐలు నారాయణయాదవ్‌, నరసయ్య, సిబ్బంది ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement