పంట కీలక సమయంలో తీవ్ర వర్షాభావం

ABN , First Publish Date - 2021-10-13T07:04:09+05:30 IST

ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట వర్షాభావంతో నిట్ట ని లువునా ఎండిపోయింది.

పంట కీలక సమయంలో తీవ్ర వర్షాభావం
రాప్తాడు మండలం ఎర్రగుంట్ల వద్ద ఎండిన వేరుశనగ

ఎండిన వేరుశనగ

 పంట కీలక సమయంలో తీవ్ర వర్షాభావం 

ఊడలు, పిందెల సమయంలో జాడలేని చినుకు 

ఊరని కాయలు, దిగుబడి శూన్యం 

4.40 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు 

60 శాతానికిపైగా పంట దెబ్బతిన్నట్లు  అంచనా 

పంట నష్టంపై ముగిసిన సర్వే... ఉన్నతాధికారులకు నివేదికలు 

బఅనంతపురం వ్యవసాయం, అక్టోబరు 12: ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట వర్షాభావంతో నిట్ట ని లువునా ఎండిపోయింది. గత నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో పంట పూర్తిగా దెబ్బతింది. ఊడలు దిగి, పిందెలు కాసే సమయాల్లో వర్షం రాకపోవడంతో పంటనష్టం జరిగింది. పంట ఎండిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో  పొలాల్లోనే దున్నేశారు. వర్షాభావ పరిస్థితుల్లో వేరుశనగ పంటనష్టంపై క్షేత్ర స్థాయి సర్వే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 60 శాతానికిపైగానే పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు సమాచా రం. త్వరలో రాష్ట్ర ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికలు పంపేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ పంటనష్టంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంది. జిల్లాలో నెలకొన్న ప్ర త్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటనష్ట పోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాల్సి ఉంది. 


కీలక సమయంలో తీవ్ర వర్షాభావం.. 

ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో, వేరుశనగ పంట సాగు చేసే సమయం లో వర్షాలు బాగా పడ్డాయి. దీంతో తమ పంట పండినట్టేనని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో పంట ఊడ, పిందె దశలో ఉండగా వర్షం పడకపోవడం తో జూన, జూలై మాసాల్లో సాగు చేసిన వేరుశనగ దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ కా యలే  కాయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో పిందె లు పడినా కాయలు ఊరలే దు. చెట్టు ఊడలు దిగే సమయంతో పాటు పిందెలు కాసే సమయంలో వేరుశనగ పంట కు వర్షం తప్పని సరి. భూమిలో తేమ ఉన్నప్పుడే ఊడలు భూమిలోకి దిగతాయి. లేకపోతే ఊడ లు దిగకపోవడంతో పిందెలు ఏర్పడే పరిస్థితి ఉండ దు. అలాగే పిందె పడే సమయం నుంచి కాయలు ఊరే సమయంలోను వర్షం పడాలి. లేకపోతే పిందె లు ఊరే పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది ఇలాంటి పరిస్థితుల్లోనే వేరుశనగ పంట ఎండి పోయింది.


60 శాతానికిపైగా పంట నష్టం   

ఈ ఏడాది ఖరీ్‌ఫలో 4.40 లక్షల హెక్టార్ల దాకా వేరుశనగ పంట సాగైంది. జూన మాసంలో 1.5 లక్షల హెక్టా ర్లు, మిగిలిన విస్తీర్ణంలో జూలై, ఆగస్టు మాసాల్లో సాగైంది. జూన, జూలై నెలల్లో సాగు చేసిన పంట ఊడలు దిగే సమయం, పిందె దశ నుంచి వర్షం పడలేదు. దీంతో కాయలు ఊరలేదు. వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా 60 శాతానికిపైగా వేరుశనగ దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసినట్లు సమాచారం. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా పరిశీలిస్తే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంట నష్టం జరిగినట్లు బాధిత రైతులు అభిప్రాయపడుతున్నారు. హెక్టారు విస్తీర్ణంలో వేరుశనగ సాగు కోసం రూ.63 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 2.65 లక్షల హెక్టార్లకుపైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిసింది. ఈ లెక్కన రూ.1669.50 కోట్ల దాకా వేరుశనగ పంట నష్టం జరినట్లు సమాచారం. 




వాన లేక పంట పాడైంది 

3.5 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశా. ఎకరాకు 25 వేల పెట్టుబడి పెట్టా. గత సంవత్సరం వేరుశనగ పంట దిగుబడి రాలేదు. ఈ సారి పంట సాగు చేసే సమయంలో బాగా వర్షాలు పడటంతో ఈ సారైనా పంట పండుతుందని ఆశలు పెట్టుకున్నా. తీరా ఊడలు దిగి , పిం దె పడే సమయంలో వర్షం పడకపోవడంతో కాయలు ఊరలేదు. పశువుల మేతకు తప్పా  ఎందుకు పనికిరాదు. రెండేళ్లుగా వేరుశనగ పంట నష్టపోయా. రైతు భరోసా సొమ్ము కూడా అందలేదు. పంటనష్టపరిహారం అం దించి ప్రభుత్వమే ఆదుకోవాలి. 

- రైతు పాలాక్షి, ఆవులదట్ల , రాయదుర్గం మండలం 



పంటంతా ఎండి పోయిందయ్యా 

జూన మాసంలో 16 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశా. ఐదెకరాలు సొంత పొలంతోపాటు మరో 11 ఎకరా లు కౌలుకు తీసుకొని పంట పెట్టా. ఎకరాకు 25 వేల దాకా పెట్టుబడి అయ్యింది. పంట పిందె దశ నుంచి వర్షం రాలేదు. అందుకే కాయలు ఊరలేదు. ఎకరాకు ఒక బస్తా దిగుబడి కూడా కష్టమే. అప్పులు చేసి పంట సాగు చేశా. వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. - రైతు నారాయణ, హంపాపురం, రాప్తాడు మండలం 




వర్షాభావంతోనే ఎండిపోయింది 

జిల్లాలో జూన,జూలై మాసాల్లో సాగు చేసిన వేరుశనగ పంట వర్షాభావంతో ఎండిపో యింది. ఊడలు దిగే సమ యంతో పాటు పిందె సమయంలో తడి తప్పని సరి. ఈ సారి ఆయా సమయాల్లో వర్షం పడక పోవడంతో వేరు శనగ పంట దెబ్బతింది. వర్షం పడని ప్రాంతాల్లో దిగుబడి భారీగా తగ్గినట్లు సమాచారం.  

- ప్రధాన శాస్త్రవేత్త సంపతకుమార్‌, కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గం

Updated Date - 2021-10-13T07:04:09+05:30 IST