వేడి నీటితో చిన్నారికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-01-21T04:46:54+05:30 IST

మండల పరిధిలోని పాటిమీదపల్లెకు చెందిన డి.విజయ్‌, శశికళల కుమారుడు దుర్గాతులసీరాం (3) ప్రమాదవశాత్తు వేడినీటిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు.

వేడి నీటితో చిన్నారికి తీవ్ర గాయాలు
తీవ్రంగా గాయపడిన చిన్నారి

ఖాజీపేట, జనవరి 20: మండల పరిధిలోని పాటిమీదపల్లెకు చెందిన డి.విజయ్‌, శశికళల కుమారుడు దుర్గాతులసీరాం (3) ప్రమాదవశాత్తు వేడినీటిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నానం చేయించేందుకు వేడినీటిని బాత్‌రూములోని టబ్‌లో ఉంచి బట్టలు తెచ్చేందుకు ఇంటిలోకి వెళ్లగానే చిన్నారి ఆడుకుంటూ వచ్చి వేడినీటి టబ్బులో కూర్చున్నాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-01-21T04:46:54+05:30 IST