నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో.. ఈ ఫొటోలోని యువకుడు ఎవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-08-31T00:03:25+05:30 IST

సినిమా నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులకు సంబంధించి ఏ చిన్న విషయం జరిగినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం సహజంగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడి కొడుకు ఫొటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో.. ఈ ఫొటోలోని యువకుడు ఎవరో తెలిస్తే..

సినిమా నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులకు సంబంధించి ఏ చిన్న విషయం జరిగినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం సహజంగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడి కొడుకు ఫొటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టార్ కొడుకు రూల్ బ్రేక్ చేశాడు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకూ ఆ యువకుడు ఎవరి తనయుడు అంటే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్. ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో అసలు యాక్టివ్‌గా ఉండడు. అందుకేనేమో అతడికి సంబంధించి ఏ ఒక్క ఫొటో బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతోంది. శనివారం రాత్రి ఆర్యన్ ఖాన్ స్నేహితుడు అభయ్ ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. 


ఈ ఫొటోలో అనన్యా పాండే కజిన్ అహాన్ పాండేతో పాటు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే ఈ ఫొటో ఎక్కువగా వైరల్ కావడానికి కారణమేంటంటే.. ఈ ఫొటోలో ఆర్యన్ ఖాన్ కెమెరా వైపు చూస్తుండటమే. అవును.. ఆర్యన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని అనేక ఫొటోలను చూసినా, ఇతర ఫొటోల్లోనూ అతడు అసలు కెమెరా వైపు చూడడు. అందుకేనేమో నెటిజన్లు స్టార్ హీరో కొడుకు మొదటిసారి బ్రేక్ రూల్ చేసి కెమెరా వైపు చూస్తూ స్టిల్ ఇచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఆర్యన్ ఖాన్ ఈ ఏడాది మేలో యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో సినిమాటిక్ ఆర్ట్స్‌పై డిగ్రీ పట్టా పొందారు. 

Updated Date - 2021-08-31T00:03:25+05:30 IST