శారదానది గట్లను పటిష్టపరుస్తాం

ABN , First Publish Date - 2021-08-04T06:12:11+05:30 IST

శారదానది పరివాహక ప్రాంతంలో గణపర్తి వద్ద బలహీనంగా ఉన్న గట్లను శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచడానికి నిధులు మంజూరు చేస్తామని విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

శారదానది గట్లను పటిష్టపరుస్తాం
గణపర్తి వద్ద శారదానది గట్లను పరిశీలిస్తున్న ఆనంద్‌కుమార్‌, సుకుమారవర్మ

విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌


మునగపాక, ఆగస్టు 3: శారదానది పరివాహక ప్రాంతంలో గణపర్తి వద్ద బలహీనంగా ఉన్న గట్లను శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచడానికి నిధులు మంజూరు చేస్తామని విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమారవర్మ, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి మంగళవారం ఈ గట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్‌ అధికారుల సూచన మేరకు వచ్చే జనవరిలో శాశ్వత పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మెటీరియల్‌ సరఫరాకు రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాలని సుకుమార్‌వర్మను సూచించారు. కార్యక్రమంలో డెయిరీ ఏజీఎం శ్రీనివాసరావు, సివిల్‌ ఇంజనీర్‌ వెలగా సురేశ్‌, జేవో శరగడం రమణ, ఇరిగేషన్‌ ఏఈ శివరామకృష్ణ, సర్పంచ్‌లు చదరం గణేశ్‌నాయుడు, భాస్కరరాజు, దొడ్డి సూరిఅప్పారావు, జాజుల వెంకటరమణ, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్లు కె.రామ్మోహనరావు, పి.హరేరామ్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T06:12:11+05:30 IST