ఇద్దరికి పోలీసు శౌర్య పతకాలు

ABN , First Publish Date - 2020-08-15T07:27:50+05:30 IST

తెలంగాణ పోలీసులకు దేశ అత్యున్నత పోలీసు పురస్కారాలు లభించాయి. పోలీసు శౌర్య పతకానికి ఇద్దరు ఎంపికవ్వగా...

ఇద్దరికి పోలీసు శౌర్య పతకాలు

  • మరో ఇద్దరి ‘విశిష్ట’ సేవకు గుర్తింపు
  • పోలీస్‌ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులకు దేశ అత్యున్నత పోలీసు పురస్కారాలు లభించాయి. పోలీసు శౌర్య పతకానికి ఇద్దరు ఎంపికవ్వగా.. మరో ఇద్దరిని రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు వరించాయి. 10 మంది పోలీసులు ప్రతిభావంతమైన పోలీసు సేవా పతకానికి ఎంపికయ్యారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన పోలీసులకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కేంద్ర హోంశాఖ శుక్రవారం మెడల్స్‌ను ప్రకటించింది. జాబితాలో తెలంగా ణకు చెందిన పోలీసులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం 215 మందికి పోలీసు శౌర్య పతకాలను ప్రకటించింది. 80 మందిని రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకానికి, 631 మందిని పోలీసు సేవా పతకానికి ఎంపిక చేశారు. రక్షణ శాఖలో నలుగురికి ‘శౌర్య చక్ర’ పతకాలను ప్రకటించారు. వాయుసేన వింగ్‌ కమాండర్‌ విశాక్‌నాయర్‌, సైన్యానికి చెందిన లెఫ్టెనెంట్‌ కల్నల్‌ కిషన్‌సింగ్‌ రావత్‌, మేజర్‌ అనిల్‌ ఉర్స్‌, హవల్దార్‌ అలోక్‌ కుమార్‌ దూబేలను శౌర్యచక్ర వరించింది. 2008లో ఢిల్లీ బాత్లాహౌస్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మకు మరణం తర్వాత ఏడోసారి శౌర్యపతకం లభించడం గమనార్హం. అదేవిధంగా.. సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ నరేశ్‌కుమార్‌కు నాలుగేళ్లలో 7పోలీసు పతకాలు లభించాయి. ఆయన ఏడేళ్ల సర్వీసులో ఉగ్రవాద నిరోధక బృందంలో అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించింది.   


తెలంగాణ పోలీసుల జాబితా..

పోలీసు శౌర్య పతకం - 2 

1) మొగుళ్ల వెంకటేశ్వర్‌ గౌడ్‌, ఎస్సై

2) మహమ్మద్‌ మెహరాజుద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌

రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం - 2

1) పి.ప్రమోద్‌ కుమార్‌ (ఐజీ), వరంగల్‌ సీపీ

2) తోట సుబ్రమణ్యం, కేపీహెచ్‌బీ ఎస్సై, సైబరాబాద్‌

పోలీసు సేవా పతకం - 10

నాయిని భుజంగ రావు, ఏసీపీ, రాచకొండ కమిషనరేట్‌;  మనసాని రవీందర్‌ రెడ్డి, డిప్యుటీ డైరెక్టర్‌, ఏసీబీ, హైదరాబాద్‌; సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్‌, సైబరాబాద్‌; ఎం.జయరాజు, అదనపు కమాండెంట్‌, టీఎస్‌ఎస్‌పీ, వరంగల్‌; దడ్బీకర్‌ ఆనంద్‌ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ, హైదరాబాద్‌; పణికంటి వెంకట గిరి, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ, హైదరాబాద్‌; బోయిన కిష్టయ్య, అదనపు ఎస్పీ, భద్రాద్రి-కొత్తగూడెం; కట్టెగుమ్మల రవీందర్‌ రెడ్డి, తెలంగాణ పోలీస్‌ అకాడమీ డీఎస్పీ, హైదరా బాద్‌; ఎరుకుల్ల నాగరాజు, ఇన్‌స్పెక్టర్‌, హైదరాబాద్‌; షేక్‌ సాధిక్‌ అలీ, ఎస్సై, మల్కాజిగిరి


రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం

 1) జె.రామారావు, హెడ్‌ కానిస్టేబుల్‌, సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ, హైదరాబాద్‌


సీఆర్‌పీఎఫ్‌లో  పోలీసు సేవా పతకం

బుద్ధయ్య రత్నమ్మ, డిప్యూటీ కమాండెంట్‌, రంగారెడ్డి జిల్లా


సీబీఐలో పోలీసు సేవా పతకం

రాయపరాజు మంతెన, కానిస్టేబుల్‌, సీబీఐ, హైదరా బాద్‌


కేంద్ర హోం శాఖలో పోలీసు సేవా పతకం

ఎలంగో గోవిందరాజు, ఎస్‌ఐబీ జేఐవో-1, హైదరాబాద్‌


 పోలీసు సేవా పతకం

1) సొన్ని లక్ష్మణ్‌, హెడ్‌కానిస్టేబుల్‌, సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ, హైదరాబాద్‌


రైల్వే పోలీసుల్లో పోలీసు సేవా పతకం

1) షేక్‌ కరీముల్లా, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌, హైదరాబాద్‌

2) వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్‌, సికింద్రాబాద్‌


Updated Date - 2020-08-15T07:27:50+05:30 IST