ఆక్సిజన్ లెవెల్ 23... వెంటిలేటర్‌పై 27 రోజులు... 30 కిలోల బరువు తగ్గి కరోనాపై విజయం!

ABN , First Publish Date - 2021-04-28T18:03:21+05:30 IST

దేశంలో అన్నివైపుల నుంచి కరోనా కేకలు వినిపిస్తున్నాయి.

ఆక్సిజన్ లెవెల్ 23... వెంటిలేటర్‌పై 27 రోజులు... 30 కిలోల బరువు తగ్గి కరోనాపై విజయం!

శిమ్లా: దేశంలో అన్నివైపుల నుంచి కరోనా కేకలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెగిటివ్ వార్తలతో పాటు ఆశ్చర్యపరిచే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హిమాచల్‌లోని శిమ్లా పట్టణానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారి అశోక్ మంగ్లా కరోనా బారినపడ్డారు. ఆక్సిజన్ లెవెల్ 23కు చేరింది. ఈ నేపధ్యంలో చికిత్స కోసం ఆసుపత్రిలో 27 రోజుల పాటు ఉన్నారు. ఇన్నిరోజుల పాటు ఐజీఎంసీలో వెంటిలేటర్‌పై ఉన్న ఆయన 30 కిలోల బరువు తగ్గడమే కాకుండా కరోనాను ఓడించారు. 


ఈ సందర్భంగా అశోక్ మంగ్లా మీడియాతో మాట్లాడుతూ తనకు సెప్టెంబరు 3న జ్వరం రావడంతో ఐజీఎంసీకి వెళ్లానని, అప్పుడు ఫ్లూ ఓపీడీ శాంపిల్ తీసుకున్నారని తెలిపారు. తరువాత తనకు అక్కడి వైద్యుల నుంచి ఫోను వచ్చిందని, తనకు కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారన్నారు. అయితే తన ఇంటిలో ఇద్దరు వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉండటంతో క్వారంటైన్ కోసం ఆసుపత్రిలో ఉండాల్సివచ్చిందన్నారు. తరువాత సెప్టెంబరు 12న తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందని, దీంతో వైద్యులు తనను వెంటిలేటర్ పై ఉంచారన్నారు. ఈ నేపధ్యంలో తన బరువు 30 కిలోలు తగ్గిందన్నారు. అక్టోబరు 2 నాటికి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. తరువాత ఇంటికి చేరుకున్నానని, అయితే కొద్దిరోజులకు తిరిగి అనారోగ్యం వాటిల్లిందని, దీంతో మరోమారు ఆసుపత్రికి వెళ్లగా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ చేరిందని తెలిసిందన్నారు. దీంతో అక్టోబరు 25న తిరిగి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందానని, ఈ సమయంలో ఏడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉండాల్సివచ్చిందని తెలిపారు. తరువాత ఆరోగ్యం కుదుపడిందన్నారు. వైద్యుల ప్రోత్సాహంతోనే తాను అనారోగ్యం నుంచి బయటపడగలిగానని మంగ్లా తెలిపారు.

Updated Date - 2021-04-28T18:03:21+05:30 IST