Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్తారింట్లో కొత్త కోడలికి షాకింగ్ అనుభవం.. పెళ్లికి ముందు జరిగిన ఘోరాన్ని బయటపెట్టిన భార్య.. అసలేం జరిగిందంటే..

భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలని.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగు పెట్టిన కోడలికి నిరాశే ఎదురైంది. కొత్త జీవితం అటుంచి.. కొత్తగా నరకం ప్రారంభమైంది. అలాగని ఆమె అనామకురాలనుకుంటే పొరపాటే. బుల్లితెర నటి అయిన ఆమె అన్నీ తెలుసుకుని.. సహ నటున్ని ప్రేమించింది. కానీ చివరికి ఆ యువతి అంచనాలు తలకిందులయ్యాయి. సహజంగానే నటీమణి అయిన ఆమెకు.. సినిమా తరహాలోనే కష్టాలు వచ్చిపడ్డాయి. చాలా మంది యువతులకు జరిగినట్లుగానే పెళ్లికి ముందే ఈమె జీవితంలో కూడా.. ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక బసవనగుడి పరిధిలోని ప్రాంతానికి చెందిన బుల్లితెర నటికి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను కూడా నటుడినని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి అభిరుచి ఒకటే కావడంతో రోజూ చాటింగ్ చేసుకునేవారు. టీవీలు, సినిమాల్లో తనకు పరిచయాలు ఉన్నాయని, అవకాశం ఇప్పిస్తానని చెప్తుండేవాడు. దీంతో యువతి అతన్ని బాగా నమ్మింది. ఓ రోజు డైరెక్ట్‌గా కలుసుకుందామంటూ మెసేజ్ చేశాడు. అప్పటికే తనని బాగా నమ్మిన యువతి.. వెంటనే ఓకే చెప్పి, ఇంటికి కూడా ఆహ్వానించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ వ్యక్తి.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా రోజూ తన కోరికలు తీర్చుకునేవాడు.

రోజులు గడుస్తున్నా తనకు అవకాశాలు ఇప్పించకపోవడంతో యువతికి అనుమానం కలిగింది. మోసపోతున్నానని గ్రహించి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో అప్పటినుంచి ఆ యువతిని పక్కన పెట్టేశాడు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేకుండా పోయాడు. చివరికి యువతి స్నేహితుల బలవంతంతో పెళ్లికి ఒప్పుకొన్నాడు. రహస్యంగా ఓ గుడిలో పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి రోజూ వేధించేవాడు. కట్నం తేవాలని ఒత్తిడి చేసేవాడు. చిత్రహింసలు తట్టుకోలేక చివరికి ఆమె ఆరోగ్యం కూడా పాడైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement