Viral Video: పైకప్పులోంచి వేళాడుతున్న బాలిక తల.. సడన్‌గా చూసి ఉలిక్కిపడ్డారు.. చివరకు..

ABN , First Publish Date - 2021-09-02T22:42:03+05:30 IST

ఇంట్లో ఒక గదిలో ఎక్స్‌ట్రాక్ట్ ఫ్యాన్ అమర్చుదామని వెళ్లిన ఆ తండ్రికి గుండెలదిరిపోయే దృశ్యం కళ్లబడింది. ఫ్యాన్ బిగించాల్సిన కన్నంలో నుంచి ఒక తల వేళ్లాడుతూ కనిపించింది. అది చూసి ఉలిక్కిపడిన అతనికి ఆ తర్వాత అర్థమైంది..

Viral Video: పైకప్పులోంచి వేళాడుతున్న బాలిక తల.. సడన్‌గా చూసి ఉలిక్కిపడ్డారు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో ఒక గదిలో ఎక్స్‌ట్రాక్ట్ ఫ్యాన్ అమర్చుదామని వెళ్లిన ఆ తండ్రికి గుండెలదిరిపోయే దృశ్యం కళ్లబడింది. ఫ్యాన్ బిగించాల్సిన కన్నంలో నుంచి ఒక తల వేళ్లాడుతూ కనిపించింది. అది చూసి ఉలిక్కిపడిన అతనికి ఆ తర్వాత అర్థమైంది.. ఆ కన్నంలో నుంచి వేలాడుతున్న తల ఏ దెయ్యందో కాదని, తన సొంత కూతురిదని. ఈ వింత ఘటన చైనాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గుయిజోకు చెందిన పుడ్డింగ్ కౌంటీలో ఒక ఇంట్లో ఈ ఘటన జరిగింది.


ఒక గదిలో ఎక్స్‌ట్రాక్ట్ ఫ్యాన్ బిగించడం కోసం 8 అంగుళాల రంధ్రం చేశారు. ఆ రంధ్రం ఎందుకు చేశారో తెలియని ఒక చిన్నారి.. దాని లోంచి కిందకు తొంగి చూడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలోనే ఆమె తల ఆ కన్నంలో ఇరుక్కుపోయింది. దీంతో బయటకు రాలేక ఆ పాప గింజుకుంటూ ఉండటాన్నే ఆ తండ్రి చూశాడు. కుమార్తెను ఆ కన్నం నుంచి బయటకు లాగడానికి అతను విశ్వప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అగ్నిమాపక దళానికి ఫోన్ చేశాడు. అక్కడకు వచ్చిన ఫైర్‌ఫైటర్లు కూడా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దీంతో వంట నూనె తీసుకొచ్చి ఆ కన్నం చుట్టూరా పోశారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రయత్నిస్తే ఆ పాప తల బయటకు వచ్చింది. అప్పుడుగానీ అందరూ ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Updated Date - 2021-09-02T22:42:03+05:30 IST