క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T04:57:42+05:30 IST

ఓటరు నమోదు ప్రక్రియను బూత్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్టేట్‌ ఎలక్ర్టోరల్‌ అబ్జర్వర్‌ శారదాదేవి తెలిపారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి
అధికారులతో సమీక్షిస్తున్న శారదాదేవి

అధికారులతో సమీక్షించిన స్టేట్‌ ఎలక్ర్టోరల్‌ అబ్జర్వర్‌ శారదాదేవి


ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 7 : ఓటరు నమోదు ప్రక్రియను బూత్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్టేట్‌ ఎలక్ర్టోరల్‌ అబ్జర్వర్‌ శారదాదేవి తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఫారం-6కు జతపరచిన గుర్తింపు పత్రాలను పరిశీలించారు. ఫారం-7లో నోటీసులు ఇచ్చారా లేదా పరిశీలించారు. ఓటరు దరఖాస్తులకు అన్ని గుర్తింపు పత్రాలు సరిగా ఉన్నదీ లేనిది పరిశీలించారు. ప్రతి ఓటరుకు సంబంధించిన దరఖాస్తు వివరాలన్నింటి రికార్డులు భద్రంగా ఉండాలన్నారు. సమీక్షా సమావేశంలో ఈఆర్‌ఓ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు రామునాయక్‌, ప్రొద్దుటూరు, రాజుపాళెం తహసీల్దారులు నజీర్‌ అహ్మద్‌, మహబూబ్‌ చాంద్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు అజయ్‌బాబు, రోనాల్డ్‌ శివారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T04:57:42+05:30 IST