పిచ్చిమొక్కలు.. ముళ్లపొదలు

ABN , First Publish Date - 2021-10-13T05:27:20+05:30 IST

విద్యార్థు లకు ఆటపాటలతో కూడినసైన్స్‌ పరిజ్ఞానాన్ని అందిం చేందుకు గత కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ప్రత్యేక చొరవ తో జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల ఆవరణలో నిర్మిం చిన ఏపీజే అబ్దుల్‌ కలాం సైన్స్‌ థీమ్‌ పార్కు ఏర్పా టు మున్నాళ్ల ముచ్చటగానే మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పిచ్చిమొక్కలు.. ముళ్లపొదలు

రూ. లక్షల నిధులు నేలపాలు 

నాణ్యత లేక శిథిలావస్థకు చేరుకుంటున్న సైన్స్‌ గార్డెన్‌లు

అసౌకర్యాలతో సందర్శనకు ఆసక్తి చూపని విద్యార్థులు

రెండేళ్లుగా తెరుచుకోని సైన్స్‌ పార్కు

ఆదిలాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థు లకు ఆటపాటలతో కూడినసైన్స్‌ పరిజ్ఞానాన్ని అందిం చేందుకు గత కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ప్రత్యేక చొరవ తో జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల ఆవరణలో నిర్మిం చిన ఏపీజే అబ్దుల్‌ కలాం సైన్స్‌ థీమ్‌ పార్కు ఏర్పా టు మున్నాళ్ల ముచ్చటగానే మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని పిలిపించి పార్కు నిర్మా ణాన్ని పూర్తి చేశారు. అప్పట్లో ప్రత్యేక నిపుణుల బృం దం జిల్లాలో పర్యటించి సైన్స్‌ పార్కు నిర్మాణంపై జిల్లా అధికారులకు సలహాలు సూచనలు చేసింది. నిపుణుల కమిటీ పార్కు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వ డంతో రూ.32.2లక్షల నిధులను మంజూరు చేయడం తో విద్యాశాఖ, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ అధికారులు ప నులను పూర్తి చేశారు. ఈ పార్కును ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా ఆదరణ లేకపోవడంతో అస్త వ్య స్తంగా మారి అసౌకర్యాలతో కనిపిస్తోంది. ప్రస్తుతం పార్కులో అడుగు పెట్టేందుకే అస్కారం లేకపోవడం తో పార్కును సందర్శించేందుకు విద్యార్థులెవరూ రావ డం లేదు. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ కరు వవడంతో ఆనవాళ్లనే కోల్పోతోంది. పార్కు చుట్టూ ప్ర హారిని ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, పందు లు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అప్పట్లోనే పార్కు నిర్మాణం పనులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారుల తీరుమాత్రం మారినట్లు కనిపించడం లేదు. ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖ ల మధ్య సమన్వయం లేక పోవడంతో లక్షల రూపాయల నిధులు నేలపాలవుతున్నాయి. ఇకనైనా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిని సారిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల్లో సైన్స్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించే ఆస్కారం ఉంటుంది.

అధికారుల తప్పిదం..

సైన్స్‌ పార్కు నిర్మాణంలో అడుగడుగునా అధికారుల తప్పిదం కనిపిస్తోంది. ప్రణాళిక, నిర్మాణం పనుల్లో నాణ్యత డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నేలను ఏ మాత్రం చదును చేయకుండానే హడావిడిగా పనులను చేపట్టడంతో నాణ్యత పూర్తిగా నగుబాటుగా మారుతోంది. వర్షాలు కురిస్తే కాన్వెంట్‌ స్కూల్‌, ఎన్టీఆర్‌చౌక్‌ పరిసర ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి సైన్స్‌ పార్కులో చేరుతోంది. దీంతో సిమెంట్‌ పనులు పూర్తిగా దెబ్బతిని పోయి ఆనవాళ్లనే కోల్పోయింది. అసలు పార్కు నిర్మాణం ప్లాన్‌లోనే తప్పిదాలు జరగడంతో చిన్నపాటి వర్షానికే పార్కు పరిసరాలు పూర్తిగా జలమయమై పోతున్నాయి. ఎత్తైన ప్రదేశంలో నిర్మించాల్సి ఉండగా అవసరం లేకు న్నా పార్కు స్థలాన్ని తవ్వేసి మరీ నిర్మాణం పనులను చేపట్టడంతోనే అధ్వానంగా తయారైందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. గత కలెక్టర్‌ను ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, ఇంజనీరింగ్‌ అధికారులు తప్పుతోవపట్టించి అస్తవ్యస్తంగా పనులు చేపట్టారనే ఆరోపణలు లేక పోలేదు.   

చిట్టడవిని తలపిస్తున్న సైన్స్‌ పార్కు..

రెండేళ్లుగా సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం సైన్స్‌ పార్కు చిన్న పాటి చిట్టడవిని తలపిస్తోంది. ఇప్పటికే సైన్స్‌ థీమ్‌ గార్డెస్‌లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థులకు సైన్స్‌ పై స్వీయ పరిజ్ఞానాన్ని కల్పించేందుకు పార్కులో ఏర్పా టు చేసిన 34సైన్స్‌ గార్డెస్‌లు అస్తవ్యస్తంగా మారాయి. సైన్స్‌ పరికరాల పనితీరును వివరించేందుకు వాటి పక్కనే ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్ట్‌లు ఊడిపోయి నేలపాలయ్యాయి. హడావిడిగా పనులు చేయడమే ఇలాంటి పరిస్థితులకు కారణమంటున్నారు. సైన్స్‌ పార్కు నిర్మాణంపై కూడా అధికారులకు సరైన అవ గాహన లేకపోవడంతోనే కాంట్రాక్ట్‌ కంపెనీ సిబ్బంది చెప్పిందేపై చేయిగా మారింది. మొత్తానికి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆచరణ సాధ్యం కాకపోవ డంతో జిల్లా విద్యార్థులకు సైన్స్‌ పరిజ్ఞానం అందని ద్రాక్షగానే మారుతోంది. కలెక్టర్‌ ప్రత్యేకశ్రద్ధతో ఏర్పాటు చేసిన సైన్స్‌ పార్కు ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ముళ్లపొదల్లో దర్శనమివ్వడంతో అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. పార్కుచుట్టూ ఎటు చూసిన అపరిశుభ్రత పరిసరాలే దర్శనమిస్తున్నాయి. అలాగే దీనిని ఆనుకొని బిర్యాని, రెస్టారెంట్లు ఉండడం తో వ్యర్థాలను పార్కు ప్రదేశంలోనే నిర్లక్ష్యంగా పారవే స్తున్నారు. విద్యార్థులు నేర్చుకునే సైన్స్‌ థీమ్‌ గార్డెస్‌లను ఆనుకొని భారీ మురికి నీటి గుంతలు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-10-13T05:27:20+05:30 IST