Abn logo
Apr 11 2021 @ 10:15AM

అర్ధరాత్రి షట్టర్లు పగలగొట్టి.. దొంగల బీభత్సం

రాజమండ్రి: నగరంలో వరుస దొంగతనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంబాజీపేట, పులేటికుర్రు ప్రధాన సెంటర్‌లో దొంగలు రెచ్చిపోయారు. అంబాజీపేటలోని నాలుగు షాపులు, పులెటికుర్రులో మూడు షాపులను పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. షాపుల షటర్లు పగల గొట్టి అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. దీనిలో పాత నేరస్థుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement