Abn logo
Jul 9 2020 @ 21:23PM

ఏపీకి మద్యం తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం నాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా అక్రమ మద్యం తరలిస్తున్న పలువుర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సీఐ పులి హనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.ఐ. విజయ కుమార్ (వీఆర్‌లో ఉన్నారు), ఏలూరుకు చెందిన నున్న కమల్, సంతోష్‌లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా.. మరో నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement