సిద్దిపేటను మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్తా: collector

ABN , First Publish Date - 2021-11-17T17:29:17+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలను మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని జిల్లా నూతన కలెక్టర్ ఎం హనుమంతరావు అన్నారు.

సిద్దిపేటను మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్తా: collector

సిద్దిపేట: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలను మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని జిల్లా నూతన కలెక్టర్ ఎం హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై త్వరగా సమీక్ష నిర్వహించి వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ, నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఆదేశానుసారం తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి స్టేటస్ తెలుసుకొని క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్తామని హనుమంతరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-17T17:29:17+05:30 IST