సిద్దిపేట డీసీఎస్‌వోను సస్పెండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-10-28T04:38:52+05:30 IST

చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణానికి పూర్తిస్థాయిలో సహకరించిన సిద్దిపేట డీసీఎ్‌సవో హరీశ్‌ను సస్పెండ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి డిమాండ్‌ చేశారు.

సిద్దిపేట డీసీఎస్‌వోను సస్పెండ్‌ చేయాలి
మహాదీక్షలో మాట్లాడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి


 అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి

 రైతు మహాదీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి


చేర్యాల, అక్టోబరు 27: చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణానికి పూర్తిస్థాయిలో సహకరించిన సిద్దిపేట డీసీఎ్‌సవో హరీశ్‌ను సస్పెండ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి డిమాండ్‌ చేశారు. కొనుగోలులో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం చేర్యాలలో రైతు మహాదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడారు.  ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ప్రభుత్వ సొమ్మును పక్కదోవ పట్టించినా డీసీఎ్‌సవో హరీశ్‌ ప్రేక్షకపాత్ర వహించడం తగదన్నారు. మిల్లర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి, రైతులకు తిరిగి అందజేయాలని కోరారు. అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు బాధ్యులందరిపైనా చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. 


పీఏసీఎస్‌ చైర్మన్‌ వల్లే మా కుమారుడు చనిపోయాడు


నకిలీ ట్రక్‌షీట్ల విషయంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగ చంద్రారెడ్డి తమ కుమారుడు చదరపల్లి పరశురాములను వేధించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల గ్రామానికి చదరపల్లి పద్మ, కనకరాములు ఆరోపించారు. తమ కుమారుడి  ఆత్మహత్యకు కారణమైన చైర్మన్‌ను శిక్షించాలని డిమాండ్‌చేశారు. అంతకుముందు సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్‌ జడ్పీఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కొమ్ము నర్సింగరావు, ఆది శ్రీనివాస్‌, రామగల్ల పరమేశ్వర్‌, భైరవభట్ల చక్రధర్‌, ఒగ్గు రాజు, అందె బీరయ్య, అందె అశోక్‌, పోతుగంటి రాందాస్‌, మల్లిగారి యాదయ్య, బుట్టి భిక్షపతి, బుట్టి సత్యనారాయణ, రామగల్ల నరేశ్‌, ఈరు భూమయ్య పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-28T04:38:52+05:30 IST