Siddipet: పోలీసుల దిగ్బంధంలో ‘ఎర్రవల్లి’ గ్రామం

ABN , First Publish Date - 2021-12-27T16:52:35+05:30 IST

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లింది.

Siddipet: పోలీసుల దిగ్బంధంలో ‘ఎర్రవల్లి’ గ్రామం

సిద్దిపేట: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ నేపథ్యంలో ఎర్రవల్లికి కొత్తవారిని అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఎర్రవల్లిలో రేవంత్ వస్తే అడ్డుకుంటామని గ్రామంలో  టీఆర్ఎస్ శ్రేణులు మోహహరించారు. జిల్లా నలుమూలలా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. రేవంత్ కార్యక్రమానికి అనుమతి లేనందున ఎర్రవల్లికి ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామంలోకి మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. 

Updated Date - 2021-12-27T16:52:35+05:30 IST