Abn logo
Sep 16 2021 @ 13:47PM

సీఎం కేసీఆర్ చేతిలో హరీష్ రావు తోలుబొమ్మ: జితేందర్ రెడ్డి

సిద్దిపేట:  ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావు సీఎం కేసీఆఆర్ చేతిలో తోలు బొమ్మలా ఆడుతున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని, అబద్దాలు చెప్పి గెలిచే రోజులు పోయాయన్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి ఓటమి చెందిందని..అయితే  ఓడిన చోట ప్రభుత్వం పని చెయ్యదా అని ప్రశ్నించారు. హరీష్ రావు దత్తత గ్రామమైన కొల్గుర్‌లోనే 60 ఇండ్లు నిర్మించలేదని, హూజరాబాద్‌లో ఎం అభివృద్ది చేస్తారని నిలదీశారు. హరీష్ సొంత నియోజకవర్గంలో దళిత బందు, రుణమాఫి, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేయలేదన్నారు. కేంద్రం వాట 50 శాతం ఇస్తుందన్న కేటీఆర్, సెంట్రల్ వ్యవస్థ నుండి వచ్చే వాటానే ఇచ్చిందని తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్రం వాటా తప్పకుండా కొంటుందన్నారు. హుజరాబాద్‌లో లక్ష ఓట్ల మెజారిటీతో ఈటెల గెలుస్తారని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption