ఢిల్లీలో 51 మందిలో దుష్ప్రభావాలు

ABN , First Publish Date - 2021-01-17T07:51:36+05:30 IST

ఢిల్లీలో కరోనా టీకాలు వేయించుకున్న వారిలో 51 మందిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఉత్తర ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారవర్గాలు వెల్లడించాయి. దక్షిణ

ఢిల్లీలో 51 మందిలో  దుష్ప్రభావాలు

ఒకరి ఆరోగ్యం విషమం


న్యూఢిల్లీ, జనవరి 16: ఢిల్లీలో కరోనా టీకాలు వేయించుకున్న వారిలో 51 మందిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఉత్తర ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారవర్గాలు వెల్లడించాయి. దక్షిణ ఢిల్లీ, నైరుతి ఢిల్లీల పరిధిలోని జిల్లాల్లో 22మంది.. పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో 12.. ఆగ్నేయ ఢిల్లీ, న్యూఢిల్లీల పరిధిలో 10 మంది.. వాయవ్య ఢిల్లీలో నలుగురు, సెంట్రల్‌ ఢిల్లీలో ఇద్దరు, ఉత్తర ఢిల్లీలో ఒకరిలో దుష్ప్రభావాలను గుర్తించారని తెలిపాయి.


అయితే వీరిలో కేవలం ఒకరి పరిస్థితే విషమించిందని, సదరు వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని ఐసీయూలో చేర్చారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నాయి. బాధితుడు టీకా తీసుకున్న అనంతరం తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం, గుండె కొట్టుకునే రేటు పెరగడం వంటి సమస్యలు తలెత్తినట్లు సమాచారం.


ఇక రాజస్థాన్‌లో 21 మందిలో, మహారాష్ట్రలో 14 మందిలో, హరియాణాలో 13 మందిలో దుష్ప్రభావాలు తలెత్తాయి. ఇక ఢిల్లీలో  53ు (4,319) మందే టీకాలు వేయించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ‘కొవిన్‌’ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా టీకా కార్యక్రమాన్ని సోమవారం(జనవరి 18) వరకు నిలిపివేయాలని మహారాష్ట్ర నిర్ణయించింది.  


Updated Date - 2021-01-17T07:51:36+05:30 IST