ఉక్రెయిన్‌లో సిక్కు సోదరులు చేస్తున్న పనులు చూస్తే.. వారిని మెచ్చుకోకుండా ఉండలేరు!

ABN , First Publish Date - 2022-02-27T12:56:28+05:30 IST

సేవా స్ఫూర్తి అనేది సిక్కుల..

ఉక్రెయిన్‌లో సిక్కు సోదరులు చేస్తున్న పనులు చూస్తే.. వారిని మెచ్చుకోకుండా ఉండలేరు!

సేవా స్ఫూర్తి అనేది సిక్కుల డీఎన్ఏలో ఉంటుందంటారు. ఏ సంక్షోభం వచ్చినా సాయం చేయడంలో వీరు ముందుంటారు. దేశం మొదలుకొని విదేశాల వరకు ఎక్కడైనా సరే సిక్కులు ఆపద సమయంలో తమను తాము పట్టించుకోకుండా కూడా బాధితులకు సహాయం చేస్తుంటారు. అదే స్ఫూర్తి ఇప్పుడు ఉక్రెయిన్‌లో కూడా కనిపిస్తోంది, అక్కడి సిక్కు సోదరులు.. యుద్ధ ప్రాంతాలకు తరలివెళ్లి బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలను నిస్వార్థంగా చేస్తున్నారు. 


గతంలో తలెత్తిన మయన్మార్ సంక్షోభం, ఐఎస్ఐఎస్ తీవ్రవాద దాడుల ఘటనలు, రైతుల ఉద్యమం, ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ఉద్యమం, వరద బాధిత ప్రాంతాలు, కరోనా మహమ్మారి సంక్షోభం.. ఇలా ప్రతి సందర్భంలోనూ  సిక్కు సోదరులు భాధితులకు ఆహారం అందించడంతో పాటు పలు సేవలు చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో సిక్కు కమ్యూనిటీ వారు ఆహారాన్ని రైళ్లలో బాధిత ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో రైళ్లలోని ప్రయాణీకులకు కూడా ఆహారం అందజేస్తున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన వెంటనే అక్కడి ప్రజలు తమ డబ్బును బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకుని.. దుకాణాలకు వెళ్లి పెద్దమొత్తంలో రేషన్ కొనుగోలు చేసి, వారి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. ఫలితంగా వారు యుద్ధ సమయంలో ఇంట్లోనే ఉంటూ ఆహార ఏర్పాట్లు చేసుకోవచ్చని భావించారు. అయితే అక్కడి ప్రజలు అత్యధికంగా నిత్యావసరాలు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం చాలా దుకాణాలు ఖాళీగా మారాయి. చదువుల కోసం వెళ్లిన వారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Updated Date - 2022-02-27T12:56:28+05:30 IST