AP: సింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-07T14:01:32+05:30 IST

సింగనమల ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతికి పెను ప్రమాదం తప్పింది.

AP: సింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

అనంతపురం: సింగనమల ఎమ్మెల్యే  జొన్నల గడ్డ పద్మావతికి పెను ప్రమాదం తప్పింది. ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్లి వస్తుండగా జొన్నలగడ్డ పద్మావతి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.  ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మావతి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ప్రమాదం ధాటికి ఎమ్మెల్యే కారు పూర్తిగా ధ్వంసమైంది.


ఎలా జరిగింది..!

ఎమ్మెల్యే బుధవారం రాత్రి సోమలదొడ్డి సమీపంలోని ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లారు. తిరిగి రాత్రి 10.30 గంటల సమయంలో నగరంలోని ఇంటికి తన కారులో బయలుదేరారు. సర్వీస్‌ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్తుండగా అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారు ఎమ్మెల్యే కారును ఢీకొట్టింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో కార్లు రెండూ దెబ్బతిన్నాయి. దీంతో రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో కారులో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు.


Updated Date - 2021-10-07T14:01:32+05:30 IST